AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: కేవలం రూ.5వేల లోపే వాషింగ్‌ మెషిన్‌.. ఫిచర్స్‌ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

ఇది టెక్నో ఆటోమేటిక్ పోర్టబుల్ ఫోల్డబుల్ వాషింగ్ మెషిన్. ఈ మెషీన్‌లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ..

Good News: కేవలం రూ.5వేల లోపే వాషింగ్‌ మెషిన్‌.. ఫిచర్స్‌ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
Portable Washing Machine
Jyothi Gadda
|

Updated on: Sep 21, 2022 | 9:43 PM

Share

Good News: నేటి కాలంలో చాలా ఇళ్లలో ఇప్పటికే వాషింగ్ మెషీన్ ఉంది. దాని సహాయంతో మీ రోజువారీ బట్టలు మెరుస్తాయి. కానీ ప్రస్తుతం చదువు కోసం..ఉద్యోగాలు చేస్తూ ఒంటరిగా బతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు సాధారణంగా వాషింగ్ మెషీన్లు కొనరు.. తమ బట్టలు సొంతంగా ఉతుక్కుంటారు..మీరు కూడా ఇలాంటి వారిలో ఉన్నట్టయితే.. మీ ఇంట్లో తక్కువ మంది ఉన్నట్టయితే..మీరు వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేయకుంటే మీ కోసమే అందుబాటులోకి వచ్చింది..ఈ పోర్టబుల్‌ వాషింగ్ మెషీన్.. టిఫిన్ బాక్స్ అంత చిన్నది. అవును మీరు చదివింది నిజమే..పైగా ధర కూడా అంతే తక్కువ.

టిఫిన్ బాక్స్‌లా చిన్నగా ఉండేలా అడ్జస్ట్ చేసుకునేంత చిన్న మెషీన్ గురించి మేము మీకు చెప్పబోతున్నాం. ఇది టెక్నో ఆటోమేటిక్ పోర్టబుల్ ఫోల్డబుల్ వాషింగ్ మెషిన్. ఈ మెషీన్‌లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే .. దీనిని టిఫిన్ బాక్స్ పరిమాణంలో మడతపెట్టవచ్చు. ఈ పోర్టబుల్ వాషింగ్ మెషీన్‌ను మీరు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లడానికి ఇదే కారణం.

మీరు ఈ వాషింగ్ మెషీన్‌ను ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ పోర్టబుల్ ఫోల్డబుల్ మెషిన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999కి బదులుగా 52% తగ్గింపు తర్వాత రూ.4,799కి విక్రయించబడుతోంది. మీకు కావాలంటే, మీరు EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక,ఈ పోర్టబుల్ ఫోల్డబుల్ వాషింగ్ మెషీన్ బట్టలు ఉతకడానికి 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఈ ఆటోమేటిక్ మెషీన్‌లో టచ్ కంట్రోల్ సదుపాయం అందించబడింది. దీన్ని సులభంగా ఆపరేట్ చేయడానికి ఒక బటన్ కూడా ఇవ్వబడింది. ఇందులో మీరు ఒకేసారి పది బట్టలు ఉతకవచ్చు. దాని బరువు కూడా చాలా లైట్‌వెయిట్‌.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి