Vastu shastra: ఆ స్థలంలో అరటి చెట్టు నాటుతున్నారా..? జర భద్రం.. ఆనందం, ఆస్తులు ఆవిరైనట్టే..!
అరటి చెట్టును నాటడం, పూజించడం ద్వారా విష్ణువు, లక్ష్మీ దేవీని ప్రసన్నం చేసుకున్నట్టే అంటున్నారు వాస్తు నిపుణులు. ఈ విధంగా, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. కానీ,..
Vastu shastra: అరటి చెట్టులో విష్ణువు ఉంటాడంటారు..అందుకే దానిని పూజిస్తారు. అరటి చెట్టును నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కానీ, అరటి చెట్టును తప్పుడు ప్రదేశంలో నాటితే అది అనేక అనర్ధాలకు దారితీస్తుంది. అలాంటి స్థలంలో అరటి చెట్టును నాటవద్దంటున్నారు వాస్తు నిపుణులు..అలా చేస్తే…ఆనందం, శ్రేయస్సుకు బదులుగా పేదరికం ఆవహిస్తుందని హెచ్చరిస్తున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
మనకు చెట్లు, మొక్కలను పూజించే సంప్రదాయం ఉంది. అందులో కొన్ని ప్రత్యేకమైన చెట్లు ఉన్నాయి. వాటిలో దేవతలు కొలువై ఉంటారని విశ్వాసం. వాటిలో అరటిచెట్టు ఒకటి. అరటిపండులో బృహస్పతి నివాసం ఉంటాడు. కాబట్టి, ఏదైనా శుభ సందర్భంలో అరటి చెట్టును పూజించడం చాలా ముఖ్యం. అరటిపండును పూజించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. అయితే ఈ చెట్టును ఏదైనా తప్పు ప్రదేశంలో నాటితే అది మంచిది కాదు. అరటి చెట్టును ఏ దిక్కున నాటకూడదో తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం.. అరటి చెట్టును ఆగ్నేయ దిశలో అంటే అగ్ని కోణంలో నాటకూడదు.. అగ్ని కోణంలో అరటి చెట్టును నాటడం అశుభం. అరటి చెట్టుకు ముళ్ల చెట్ల మొక్కలను నాటకూడదు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో తగాదాలు వచ్చి బంధం చెడిపోతుంది. చెట్లు, కాక్టస్ వంటి మొక్కల దగ్గర అరటిని నాటడం మంచిది కాదు. ఇంటి ప్రధాన ద్వారం ముందు అరటి చెట్టును నాటడం మంచిది కాదు. ప్రధాన ద్వారం పడేలా అరటి చెట్టును నాటడం ప్రతికూలతను కలిగిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద నాటిన అరటి చెట్టు శ్రేయస్సుకు ఆటంకంగా మారుతుంది.
వాస్తు ప్రకారం.. అరటి చెట్టును నాటడం చాలా శ్రేయస్కరం. అరటి చెట్టును నాటడం, పూజించడం ద్వారా విష్ణువు, లక్ష్మీ దేవీని ప్రసన్నం చేసుకున్నట్టే అంటున్నారు వాస్తు నిపుణులు. ఈ విధంగా, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. కానీ కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోకపోతే అది అశుభ ఫలితాలను కలిగిస్తుంది. అరటి చెట్టును జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చెట్టు, దాని ఆకులు ఎండిపోకుండా ప్రతిరోజూ దానికి నీరుపట్టాలి. అరటి చెట్టును ఏ మురికి ప్రదేశంలో ఉంచకూడదు. మురికి నీరు పోయకూడదు, అలా చేయడం హానికరం.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి