Viral Video: అయ్యా బాబోయ్‌.. ఒకేసారి 15 సిగరెట్లా.? ఇదేం స్టైల్‌ రా బాబు.. ఇక ఆ దేవుడే కాపాడాలి

చాలా మందికి మద్యపానం, దూమపానం అలవాటు సాధారణం. అయితే, కొంతమంది రోజులో చాలా సిగరెట్లు తాగుతుంటారు. ఇంకొందరు ఒకే సమయంలో అనేక సిగరెట్లను ఒకదాని తర్వాత ఒకటి పీల్చడం అప్పుడప్పుడు చూస్తుంటాం.

Viral Video: అయ్యా బాబోయ్‌.. ఒకేసారి 15 సిగరెట్లా.? ఇదేం స్టైల్‌ రా బాబు.. ఇక ఆ దేవుడే కాపాడాలి
15 Cigarettes
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 21, 2022 | 6:27 PM

Viral Video:  సినీ అభిమానుల్లో కేజీఎఫ్​-2 సినిమా క్రేజ్‌ మామూలుగా లేదు.. సినిమాలో రాకీభాయ్​స్టైల్‌ చూసి ప్రేక్షకులు ఉర్రూతలూగిపోయారు.ముఖ్యంగా ఆ సినిమాల్లో హీరోకు ఉన్న అలవాటు సిగరెట్లు కాల్చడం..ఆ అలవాటు కూడా అభిమానుల్ని అకట్టుకుంటోంది. హీరోని చూసి కొందరు విపరీతంగా సిగరెట్లు కాల్చి ప్రమాదంలో పడ్డ ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే, అలాంటిదే ఈ సంఘటన కూడా ..అయితే, ఇక్కడ ఓ వ్యక్తి ఒకటి, రెండు కాదు.. ఒకేసారి 15 సిగరెట్లు తాగుతున్నాడు.

చాలా మందికి మద్యపానం, దూమపానం అలవాటు సాధారణం. అయితే, కొంతమంది రోజులో చాలా సిగరెట్లు తాగుతుంటారు. ఇంకొందరు ఒకే సమయంలో అనేక సిగరెట్లను ఒకదాని తర్వాత ఒకటి పీల్చడం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఒకేసారి రెండు మూడు సిగరెట్లు కూడా పీల్చటం కూడా సినిమాల్లో, పలు సందర్భాల్లో చూశాం..కానీ,ఇది నిజంగానే అరుదైన సంఘటన. ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఒకేసారి 15 సిగరెట్లు తాగుతూ కనిపించాడు. విచిత్రమైన ఫుటేజీని చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో ఒక వ్యక్తి మొత్తం 15 సిగరెట్లను ఒక చేతిలో పట్టుకుని గుప్పుమనిపిస్తున్నాడు. తన ఆరోగ్యానికి హాని కలిగించే భయం లేకుండా బహిరంగంగానే ధూమపానం చేస్తున్నాడు. పైగా అతడు తన చుట్టూ జన సమూహంతో కూర్చొని మరీ స్మోకింగ్ సెషన్‌ కొనసాగిస్తున్నాడు. పైగా అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా తన ముఖంపై చిరునవ్వుతో ఆస్వాదిస్తున్నట్లు వీడియోలో తెలుస్తుంది. అంతేకాదు..తన పక్కనే ఉన్న మరో వ్యక్తి చైన్‌స్మోకర్ కోసం ఆష్‌ట్రేని మోస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పొడవాటి జుట్టు, పొడవైన గడ్డంతో ఉన్న ఆ వ్యక్తి ఒకింత సన్యాసి మాదిరిగా కనిపిస్తున్నాడు.

ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఎస్‌కే మజార్ అప్‌లోడ్ చేశారు. వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో 3.5 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. కామెంట్‌లు డిసేబుల్ కావడంతో, నెటిజన్లు ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేస్తూ స్పందించారు. విచిత్రమైన వీడియోను రీపోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను జామ్ చేశారు నెటిజన్లు. ఒక వినియోగదారుడు స్పందిస్తూ..ఎవరైనా దయచేసి అతన్ని ఆపండి అంటూ ట్వీట్ చేశారు. ఇలా వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sk Majhar (@sk.majhar.773)

జనాదరణ పొందిన వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం రేపుతుంది. ఇలాంటి వ్యక్తులు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే వ్యసనాలలో కూరుకుపోతున్నారు. దాంతో తాము ఎదుర్కొనే ఇబ్బందులను అర్థం చేసుకోకుండా అన్ని రకాల వ్యసనాలకు అలవాటుపడుతుంటారు. అలాంటి వారు తమ జీవితాలను మాత్రమే కాకుండా ఇతరులను కూడా ఎలా ప్రభావితం చేస్తారనే దానిపై అవగాహన ఉండాలని మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి