AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏం ఐడియా గురూ.. ఇలాంటి హెల్మెట్‌ ఉంటే బైకు బుల్లెట్టులా దూసుకెళ్తుంది..

కొత్త ఆలోచనలు కష్టాల్లోనే పుడతాయి అనడానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా? ఇది చూసిన నెటిజన్లు లల్లూరాం క్రియేటివీటిని ఎంతగానో కొనియాడుతున్నారు.

Viral Video: ఏం ఐడియా గురూ.. ఇలాంటి హెల్మెట్‌ ఉంటే బైకు బుల్లెట్టులా దూసుకెళ్తుంది..
Solar Fan
Jyothi Gadda
|

Updated on: Sep 21, 2022 | 4:06 PM

Share

Viral Video:బయటకి అడుగు పెడితే వేడి ఎండే కాదు, వేడి గాలి కూడా చంపేస్తుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ విపత్తు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాకు చెందిన 77 ఏళ్ల లల్లూరామ్ ఎండ నుండి తనను తాను రక్షించుకోవడానికి కొత్త ఆలోచనను రూపొందించాడు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఉపాయం చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. లల్లూరామ్ ప్లాస్టిక్ హెల్మెట్‌తో సోలార్ ఫ్యాన్‌ని తలకు తగిలించుకుని రోడ్డుపై నడుస్తుంటే చిన్నపిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అతడిని వెంబడిస్తూ వింతగా చూస్తున్నారు. ఈ వ్యక్తికి అలాంటి ఆలోచన ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు.

అయితే, లల్లూరాం పూల వ్యాపారి. ఇంటింటికీ వెళ్లి పూలు అమ్మడం వారి దినచర్య. వయస్సు మీద పడటంతో అతని ఆరోగ్యం క్షిణించింది. ఎండలో తిరుగుతూ పనిచేయటం కష్టంగా మారింది. ఎండ నుంచి ఎలా రక్షించుకోవాలో ఆలోచించిన లల్లూరాం.. సరికొత్త యంత్రాన్ని తయారు చేశాడు. హెల్మెట్‌కి చిన్న టేబుల్‌ ఫ్యాన్‌ని అమర్చాడు. సోలార్ ఎనర్జీ సాయంతో ఆ ఫ్యాన్‌ నడిచేలా ఏర్పాట్లు చేశాడు. దీన్ని తయారు చేయడానికి అవసరమైన సామాగ్రిని తెలిసిన వ్యక్తుల నుండి సేకరించానని చెప్పాడు. అనారోగ్యం కారణంగా లల్లూరాం వ్యాపారం తగ్గిపోవడంతో పాటు కొత్త వస్తువులు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నాడు. ఎందుకంటే రోజూ ఇంటింటికీ తిరుగుతూ కుటుంబ పొట్ట నింపుకునే పరిస్థితి అతడిది.

ఇవి కూడా చదవండి
Solar Powered Fan

కొత్త ఆలోచనలు కష్టాల్లోనే పుడతాయి అనడానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా? ఇది చూసిన నెటిజన్లు లల్లూరాం క్రియేటివీటిని ఎంతగానో కొనియాడుతున్నారు. హెల్మెట్‌ పెట్టుకోవటానికి బద్దకించే వారు ఇలాంటి హెల్మెట్‌ దొరికితే.. ఎందుకు పెట్టుకోకుండా ఉంటారు..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి