Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National News: హాస్టల్‌ టాయిలెట్‌లో శవమైన తేలిన ఇంటర్‌ విద్యార్థిని..సూసైడ్‌నోట్‌లో షాకింగ్‌ విషయాలు..

మంగళవారం రాత్రి 12వ తరగతి విద్యార్థిని తన హాస్టల్‌లోని టాయిలెట్‌లో శవమై కనిపించింది. విద్యార్థిని హాస్టల్‌లో రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

National News: హాస్టల్‌ టాయిలెట్‌లో శవమైన తేలిన ఇంటర్‌ విద్యార్థిని..సూసైడ్‌నోట్‌లో షాకింగ్‌ విషయాలు..
child illness
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 21, 2022 | 2:47 PM

Tamil Nadu:తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్‌ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తమిళనాడులోని తూత్తుకుడిలో మంగళవారం రాత్రి 12వ తరగతి విద్యార్థిని తన హాస్టల్‌లోని టాయిలెట్‌లో శవమై కనిపించింది. విద్యార్థిని హాస్టల్‌లో రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థి మృతికి గల కారణాలపై అన్ని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ మేరకు చనిపోయిన బాలిక తన సూసైడ్ నోట్‌లో కొన్ని వ్యక్తిగత కారణాలను రాసింది. వ్యక్తిగత కారణాలతో ఆమె పరధ్యానంలో పడింది. దానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను మేము వెల్లడించలేము. విచారణ కొనసాగుతోందని తెలిపారు.

తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన వైతీశ్వర్ అనే 17 ఏళ్ల బాలిక తన అత్త చనిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తన స్కూల్‌లోని మరో విద్యార్థినితో నన్ను సజీవంగా చూడటం ఇదే చివరిసారి అని చెప్పిందని పోలీసులు తెలిపారు. విద్యాసంస్థల్లో జరిగిన మరణాలపై విచారణ జరపాలని రాష్ట్ర దర్యాప్తు సంస్థ సీబీసీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేసును రాష్ట్ర పోలీసులోని సీబీసీఐడీ విభాగానికి బదిలీ చేయనున్నారు.

గత కొన్ని నెలల్లో తమిళనాడులో 12వ తరగతికి చెందిన 5 మంది విద్యార్థులు వీరిలో నలుగురు బాలికలు, ఒక అబ్బాయి,11వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. చదువు ఒత్తిడితో విద్యార్థులు ప్రాణాలు కోల్పోవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. అలాగే విద్యార్థుల్లో మానసిక దృఢత్వాన్ని పెంపొందించాలని ఉపాధ్యాయులను కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి