AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: ‘డెలివరీ తర్వాత శరీరంలో మార్పులు సహజమే’.. రీఎంట్రీపై స్పందించిన కాజల్.. ఆ స్టార్ హీరో సినిమాతో..

తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గోనేందుకు తాను గుర్రం స్వారీ చేస్తూ శిక్షణ తీసుకుంటున్నాని.. అయితే గతంలో ఉన్నట్లు ప్రస్తుతం తన శరీరం లేదని.. డెలివరీ తర్వాత బాడీలో మార్పులు రావడం సహజమని వెల్లడించింది.

Kajal Aggarwal: 'డెలివరీ తర్వాత శరీరంలో మార్పులు సహజమే'.. రీఎంట్రీపై స్పందించిన కాజల్.. ఆ స్టార్ హీరో సినిమాతో..
Kajal
Rajitha Chanti
|

Updated on: Sep 21, 2022 | 3:45 PM

Share

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఇండస్ట్రీలోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. బాబు పుట్టిన నాలుగు నెలల తర్వాత తిరిగి మూవీ షూటింగ్‎లో పాల్గోనేందుకు సిద్ధమయ్యింది. ఈక్రమంలో తిరిగి తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. తాజాగా తాను గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. డెలివరీ తర్వాత శరీరంలో జరిగిన మార్పులు.. తిరిగి తాను షూటింగ్స్ కోసం ఎలా సిద్ధమయ్యింది అనే విషయాలను వివరించింది. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్.. కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న ఇండియన్ 2 మూవీలో కాజల్ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ రెండేళ్లు నిలిచిపోయింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గోనేందుకు తాను గుర్రం స్వారీ చేస్తూ శిక్షణ తీసుకుంటున్నాని.. అయితే గతంలో ఉన్నట్లు ప్రస్తుతం తన శరీరం లేదని.. డెలివరీ తర్వాత బాడీలో మార్పులు రావడం సహజమని వెల్లడించింది.

” ప్రసవం జరిగిన నాలుగు నెలల తర్వాత నేను తిరిగి షూటింగ్‏లో జాయిన్ అవుతున్నాను. గతంలో ఉన్నట్లుగా ఉంటుందని నేను అనుకోవడం లేదు. అప్పుడు నా శరీరం ఎలా ఉండేదో ఇప్పుడు అలా లేదు. బాబు పుట్టిన తర్వాత నేను పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాను. చాలా రోజుల తర్వాత ఇటీవలే జిమ్‏కు వెళ్లాను. ముందులా నా శరీరానికి ఎనర్జీ లెవల్స్ పొందడం చాలా కష్టంగా ఉంది. గుర్రపు స్వారీ చేయడం కూడా పెద్ద పనిలా అనిపించింది. గతంలో గుర్రపు స్వారీ సులభంగా చేసాను. మన శరీరం మారవచ్చు. కానీ మన ఆత్మ విశ్వాసం.. అభిరుచి ముందు ఏది కష్టం కాదు. మనం ఎప్పుడూ ముందుచూపుతో ఉండాలి. మనకు కావాల్సినదానిపై దృష్టి పెట్టాలి. మనం ఎంచుకున్న వాటిపై అపరాధ భావంతో ఉండకూడదు.” అంటూ చెప్పుకొచ్చింది.

” ఇండియన్ 2 సినిమాతో మరోసారి మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను కొత్త నైపుణ్యాలు నేర్చుకుని.. వాటిని పాటించేందుకు ప్రయత్నించాను. ఈ చిత్రంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను నిరంతరం నేర్చుకుంటునే ఉంటాను. ధన్యవాదాలు ” అంటూ రాసుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్