Video Viral: మాకూ ఇలాంటి భర్తే కావాలి.. యువతుల మనసు దోచేస్తున్న వెడ్డింగ్ వీడియో
పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరిగే అపురూప వేడుక. ఇలాంటి మధుర క్షణాలను కలకాలం పదిలంగా కాపాడుకోవాలని, అని పెళ్లిళ్లతో పోలిస్తే తమ కల్యాణం మరింత వెరైటీగా నిలిచిపోవాలని వధూవరులు కలలు కంటుంటారు....
పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరిగే అపురూప వేడుక. ఇలాంటి మధుర క్షణాలను కలకాలం పదిలంగా కాపాడుకోవాలని, అని పెళ్లిళ్లతో పోలిస్తే తమ కల్యాణం మరింత వెరైటీగా నిలిచిపోవాలని వధూవరులు కలలు కంటుంటారు. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసుకుంటారు. ఇలాంటి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వధూవరుల అందమైన ఎక్స్ ప్రెషన్స్, డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ కు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో చాలానే ఉన్నాయి. పెళ్లికి సంబంధించిన ఏ వీడియోనైనా చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. పెళ్లిలో వరుడి కాళ్లకు వధువు నమస్కారం చేయడం సాధారణమే. అయితే ఈ వీడియోలో వధువు వరుడి కాళ్లను తాకిన తర్వాత.. వెంటనే వరుడు చేసిన పనికి అక్కడ ఉన్న వారందరూ స్టన్న్ అయ్యారు. అతను చేసిన ఈ చర్యకు మురిసిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో మాంగళ్య ధారణ తరువాత వధూవరులు పూల మాలలు మార్చుకుంటుంటారు. వరుడి మెడలో మాల వేసిన తర్వాత వధువు అతని కాళ్లకు నమస్కరిస్తుంది. దీనిపై స్పందించిన వరుడు అక్కడే ఉన్న పురోహితుడితో ఆమె నా పాదాలకు నమస్కారం చేసినందున.. తానూ ఆమె పాదాలకు నమస్కారం చేస్తానని చెప్పాడు. అయితే అలా చేయకూడదని పండితుడు చెబుతాడు. అయినా వరుడు వధువు పాదాలను తాకి నమస్కరించాడు. వరుడు చేసిన ఈ పనికి వధువు ఆశ్చర్యపోయింది. ఈ అందమైన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
View this post on Instagram
వైరల్ గా మారిన ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియో చూసిన ప్రతి అమ్మాయి తనకు ఇలాంటి భర్త కావాలని కోరుకుంటుందడంలో డౌటే లేదు. కొన్ని సెకన్ల ఈ క్లిప్‌ను సోషల్ మీడియా వినియోగదారులు చాలా ఇష్టపడుతున్నారు. మళ్లీ మళ్లీ చూసేందుకు ఇష్టపడతున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు వందల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..