Telangana: మావోయిస్టు పార్టీకి భారీ షాక్.. అగ్రనేత రామన్న భార్య సావిత్రి లొంగుబాటు..

తెలంగాణ మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. మరో కీలక మహిళా నేత లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ముందు మావోయిస్టు అగ్రనేత దివంగత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య సావిత్రి

Telangana: మావోయిస్టు పార్టీకి భారీ షాక్.. అగ్రనేత రామన్న భార్య సావిత్రి లొంగుబాటు..
Maoist
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 21, 2022 | 11:58 AM

Maoist Savitri: తెలంగాణ మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. మరో కీలక మహిళా నేత లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ముందు మావోయిస్టు అగ్రనేత దివంగత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య సావిత్రి లొంగిపోయారు. ఇటీవలే రామన్న అనారోగ్యంతో చనిపోయారు. రామన్న మృతి తర్వాత ఆమె భార్య సావిత్రి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సావిత్రి తాను లొంగిపోతున్నట్లు తెలంగాణ పోలీసులకు సమాచారమిచ్చారు. బుధవారం సాయంత్రం డీజీపీ మహేందర్రెడ్డి సమక్షంలో మీడియా ముందుకు రామన్న భార్య సావిత్రి రానున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోయిన సావిత్రి పోలీసులకు పలు కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం.

కాగా.. తెలంగాణలో మావోయిస్టు పార్టీ కట్టడికి పోలీసులు భారీ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే, పలు జిల్లాల్లోకి మావోయిస్టు పార్టీకి చెందిన దళాలు ప్రవేశించాయన్న సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రెండేళ్ల కిందట ఛత్తీస్‌గఢ్ పారిపోయిన అడెల్లు భాస్కర్ దళం కూడా ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించినట్లు తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోస్ట్ వాంటెడ్ నక్సలిస్టుల ఫొటో జాబితాను సైతం విడుదల చేశారు.

ఈ క్రమంలోనే మావోయిస్టు అగ్రనేత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు ఏరియా కమాండర్ మడకం కోసి అలియాస్ రజితను కూడా భద్రాద్రి పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాజాగా సావిత్రి లొంగుబాటుతో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలినట్లు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!