Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పేరుకు తగ్గట్లే శక్తినిచ్చే పండు.. ‘డ్రాగన్’ ఫ్రూట్ ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..

దేశంలోని కొంతమంది రైతులు ఇటీవల డ్రాగన్ ఫ్రూట్‌ను బాగా సాగుచేస్తున్నారు. వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డ్రాగన్ ఫ్రూట్ పండించడం ద్వారా మంచి దిగుబడితోపాటు భారీ లాభాలు పొందవచ్చు

Health Tips: పేరుకు తగ్గట్లే శక్తినిచ్చే పండు.. ‘డ్రాగన్’ ఫ్రూట్ ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..
Dragon Fruit
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 20, 2022 | 9:56 AM

Dragon Fruit Health Benefits: దేశంలోని కొంతమంది రైతులు ఇటీవల డ్రాగన్ ఫ్రూట్‌ను బాగా సాగుచేస్తున్నారు. వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డ్రాగన్ ఫ్రూట్ పండించడం ద్వారా మంచి దిగుబడితోపాటు భారీ లాభాలు పొందవచ్చు. అయితే, డ్రాగన్ ఫ్రూట్ లాభాలను ఇవ్వడమే కాకుండా.. దాని వినియోగం ఆరోగ్యాన్ని కూడా పదిలంగా కాపాడుతుంది. క్యాన్సర్, మధుమేహం వంటి అనేక వ్యాధులను కూడా డ్రాగన్ ఫ్రూట్ దూరం చేస్తుంది. లక్షల రూపాయల ఖర్చు చేయించే వ్యాధులు డ్రాగన్ ఫ్రూట్ తింటే.. దగ్గరకు రాకుండా చేసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ మిమ్మల్ని ఏ వ్యాధుల నుంచి రక్షిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

డ్రాగన్ ఫ్రూట్‌తో మధుమేహానికి చెక్..

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. దీనితో పాటు మధుమేహం లేని వారు డ్రాగన్ ఫ్రూట్స్ తింటే భవిష్యత్తులో మధుమేహం దరిచేరదు. డ్రాగన్ ఫ్రూట్ కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది.

ఇవి కూడా చదవండి

గుండెకు ప్రయోజనకరం..

డ్రాగన్ ఫ్రూట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒమేగా -3, ఒమేగా -9 కొవ్వు ఆమ్లాలు ఇందులో కనిపిస్తాయి. ఇది గుండెకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పండులో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

క్యాన్సర్‌ నుంచి ఉపశమనం..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యాంటిట్యూమర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డ్రాగన్ ఫ్రూట్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఇది రొమ్ము క్యాన్సర్ నుంచి మహిళలను రక్షిస్తుంది. ఇంకా, ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్ల నొప్పులలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాల్లో తెలింది. ఇంకా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనితో పాటు, డ్రాగన్ ఫ్రూట్ రోగనిరోధక శక్తిని పెంచే విధంగా కూడా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి