Night Jobs: నైట్ షిఫ్ట్ చేసే వారికి షాకింగ్ న్యూస్.. ఈ ప్రమాదాలు తప్పవట.. తాజా పరిశోధనలో సంచలన విషయాలు..

ఉరుకులు పరుగుల జీవితంలో పని, ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే.. రాత్రివేళ పనిచేయడం, నిద్రపోకపోవడం మూలంగా ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశముంది..

Night Jobs: నైట్ షిఫ్ట్ చేసే వారికి షాకింగ్ న్యూస్.. ఈ ప్రమాదాలు తప్పవట.. తాజా పరిశోధనలో సంచలన విషయాలు..
Night Shift Jobs
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 21, 2022 | 9:57 AM

Night Shift Jobs – Health: ఉరుకులు పరుగుల జీవితంలో పని, ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే.. రాత్రివేళ పనిచేయడం, నిద్రపోకపోవడం మూలంగా ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. తాజా పరిశోధనలో కూడా ఇదే తేలింది. అర్థరాత్రి వరకు మెలకువగా ఉండే వ్యక్తుల్లో టైప్ 2 మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని ఒక అధ్యయనం సూచిస్తుంది. యుఎస్‌లోని రట్జర్స్ యూనివర్శిటీ పరిశోధకులు ఉదయం పూట చురుకుగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తులు.. శక్తి వనరుగా కొవ్వుపై ఎక్కువగా ఆధారపడతారని.. రాత్రి వేళ పనిచేసే వారికంటే, లేటుగా నిద్రపోయే వారి కంటే ఎక్కువ స్థాయి ఏరోబిక్ ఫిట్‌నెస్‌తో పగటిపూట మరింత చురుకుగా ఉంటారని గుర్తించారు.

మరోవైపు, పగలు, రాత్రి సమయంలో చురుకుగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తులు విశ్రాంతి సమయంలో, వ్యాయామ సమయంలో శక్తి కోసం తక్కువ కొవ్వును ఉపయోగిస్తారని అధ్యయనం తెలిపింది.

‘‘పగటి పూట పనిచేసే వ్యక్తులు.. రాత్రి వేళ పనిచేసే వ్యక్తుల మధ్య (రాత్రి వేళ తొందరగా నిద్రపోయే వారు – రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపోయేవారు) కొవ్వు జీవక్రియ (fat metabolism)లోని తేడాలు శరీర సిర్కాడియన్ రిథమ్ (మేల్కొనిఉండటం/ నిద్ర చక్రం) మన శరీరం ఇన్సులిన్‌ను ఎలా ఉపయోగిస్తుందో ప్రభావితం చేస్తుందని చూపిస్తుంది” అని రట్జర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ స్టీవెన్ మాలిన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

“ఇన్సులిన్ హార్మోన్‌కు ప్రతిస్పందించే సున్నితమైన లేదా బలహీనమైన సామర్థ్యం మన ఆరోగ్యానికి ప్రధాన ప్రభావాలను కలిగి ఉంటుంది. ఈ అధ్యయనం మన శరీరం సిర్కాడియన్ రిథమ్‌లు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై అవగాహనను మెరుగుపరుస్తుంది” అని మాలిన్ చెప్పారు.

ఈ అధ్యయనాన్ని ఎక్స్‌పెరిమెంటర్ ఫిజియాలజీ జర్నల్‌ (Experimental Physiology journal) లో ప్రచురించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న 51 మందిని రెండు గ్రూపులుగా వర్గీకరించారు. ఉదయం పనిచేసేవారిని, రాత్రి పనిచేసేవారిని విభజించి.. వారి కాలక్రమం లేదా వివిధ సమయాల్లో కార్యాచరణ, నిద్రను కోరుకునే విధానం, పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. శరీర బరువు, శరీర నిర్మాణాన్ని అంచనా వేయడానికి అధునాతన ఇమేజింగ్‌ను ఉపయోగించారు. అలాగే కొవ్వు, కార్బోహైడ్రేట్ జీవక్రియను కొలవడానికి ఇన్సులిన్ సెన్సిటివిటీ, శ్వాస నమూనాలను ఉపయోగించారు.

రోజంతా వారి కార్యాచరణ, పలు అంశాలను అంచనా వేయడానికి ఈ పరిశోధనలో పాల్గొన్న వారిని ఒక వారం పాటు పర్యవేక్షించారు. వారి క్యాలరీలు, పోషకాహారం-నియంత్రిత ఆహారాన్ని ఎంత తీసుకున్నారు, ఫలితాలపై ఆహార ప్రభావాన్ని తగ్గించడానికి రాత్రిపూట ఉపవాసం చేయవలసి వచ్చింది. రెండు నుంచి 15 నిమిషాల వ్యాయామాలను పూర్తి చేయడానికి ముందు వారు విశ్రాంతిగా ఉన్నప్పుడు పరీక్షించారు. ఇంకా ట్రెడ్‌మిల్‌పై ఒక మోస్తరు, ఒక అధిక-తీవ్రత సెషన్ కూడా పరిశీలించారు.

ఇంక్లైన్ ఛాలెంజ్ ద్వారా ఏరోబిక్ ఫిట్‌నెస్ స్థాయిలను పరీక్షించారు. ఇందులో పాల్గొనే వ్యక్తి అలసిపోయే స్థాయికి చేరుకునే వరకు ప్రతి రెండు నిమిషాలకు 2.5 శాతం ఇంక్లైన్ పెరిగింది. ఉదయం పనిచేసే వ్యక్తులు.. రాత్రి వేళ పనిచేసే వారి కంటే విశ్రాంతి, వ్యాయామ సమయంలో శక్తి కోసం ఎక్కువ కొవ్వును ఉపయోగించారని పరిశోధకులు కనుగొన్నారు. అలాంటివారిలో ఎక్కువ ఇన్సులిన్ సెన్సిటివ్‌గా ఉన్నట్లు నిర్ధారించారు.

మరోవైపు, రాత్రి వేళ పనిచేసే వారు ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటారు. అంటే వారి శరీరానికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి ఎక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది. అలాంటి వారి శరీరం కొవ్వుల కంటే శక్తి వనరుగా కార్బోహైడ్రేట్లను ఇష్టపడతాయని పరిశోధకులు తెలిపారు.

పరిశోధకుల ప్రకారం.. శక్తి వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఇన్సులిన్‌కు ప్రతిస్పందించే ఈ సమూహం బలహీనమైన సామర్థ్యం హానికరమని జర్నల్ లో తెలిపారు. ఎందుకంటే ఇది టైప్ 2 డయాబెటిస్ లేదా గుండె జబ్బుల ప్రమాదాన్ని సూచిస్తుంది. పగటి పూట పనిచేసేవారు.. రాత్రి వేళ పనిచేసే వారి మధ్య జీవక్రియ ప్రాధాన్యత (metabolic preference) లో ఈ మార్పునకు కారణం ఇంకా తెలియలేదని.. దీనికోసం తదుపరి పరిశోధన అవసరమని పరిశోధకులు తెలిపారు.

“పగటిపూట పనిచేసేవారు, రాత్రివేళ తొందరగా నిద్రపోయే వారు శారీరకంగా మరింత చురుకుగా ఉంటారని.. రోజంతా ఎక్కువ నిశ్చలంగా ఉండే రాత్రి పనిచేసే వారి కంటే ఎక్కువ ఫిట్‌నెస్ స్థాయిలను కలిగి ఉన్నారని తాము కనుగొన్నట్లు” అని మాలిన్ పేర్కొన్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి