Brain Stroke: మీకు కొన్ని రోజుల ముందు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే బ్రెయిన్‌ స్ట్రోక్‌ కావచ్చు.. జాగ్రత్త..!

Brain Stroke: ప్రస్తుతమున్న రోజుల్లో కొత్త కొత్త వ్యాధులు వెంటాడుతున్నాయి. ముందే కరోనాతో ఎన్నో ఇబ్బందులు పడి ప్రస్తుతం వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో ఊపిరి..

Brain Stroke: మీకు కొన్ని రోజుల ముందు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే బ్రెయిన్‌ స్ట్రోక్‌ కావచ్చు.. జాగ్రత్త..!
Brain Stroke
Subhash Goud

|

Sep 21, 2022 | 6:00 AM

Brain Stroke: ప్రస్తుతమున్న రోజుల్లో కొత్త కొత్త వ్యాధులు వెంటాడుతున్నాయి. ముందే కరోనాతో ఎన్నో ఇబ్బందులు పడి ప్రస్తుతం వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకుంటున్నాయి. ప్రస్తుత జీవన శైలి కారణంగా మనిషి చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, టెన్షన్‌, ఆహాన నియమాలలో మార్పులు, సరైన నిద్ర లేకపోవడం తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యం పాలవుతున్నాడు. ఇక మనిషిలో ముఖ్యమైనది మెదడు. ఇది సక్రమంగా పని చేస్తేనే ఏదైనా చేయవచ్చు. మెదడులో కొన్ని భాగాలకు రక్తం సరఫరా ఆగిపోవడంతో స్ట్రోక్‌ వచ్చేప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్‌ కణాల్లోకి సరఫరా నిలిచిపోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉందని, ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొన్ని సార్లు బ్రెయిన్‌ స్ట్రోక్‌కు సంబంధించిన సమస్యలు ముందే పసిగడితే ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు. ప్రమాదం జరగడానికి కొన్ని రోజులు, గంటల ముందే కొన్ని లక్షణాలు గుర్తించినట్లయితే ఎంతో మేలని అంటున్నారు వైద్య నిపుణులు.

బ్రెయిన్‌ స్ట్రోక్‌కు నెల ముందు ఈ లక్షణాలు..

☛ ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం

☛ ముఖం, చేతులు, కాళ్లు ఒక వైపు మాత్రమే మొద్దుబారడం

☛ కంటి చూపులో కూడా సమస్య ఏర్పడటం

☛ నెల ముందు నుంచే కంటి చూపులో తేడా కనిపించడం

☛ కళ్లు మసకబారడం లాంటివి

☛ ఈ స్ట్రోక్‌ వచ్చే ముందు అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పు

☛ ఉన్నట్టుండి కొన్ని విషయాలు మార్చిపోవడం

☛ వ్యక్తిత్వంలో మార్పులు

☛ వికారం, వాంతులు, మెదడులో కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా వాంతులు, వికారంగా ఉండటం చూపులో సమస్యతో పాటు భ్రమ పడుతున్నట్లు కూడా అనిపించడం

అలాగే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన చాలా మంది ఆడవాళ్లలో కనిపించిన లక్షణం తలనొప్పి. చాలా మంది తలవెనుక భాగంలోనే అలా అనిపించినట్లు ఉంటుంది. ఒక్కో సమయంలో స్పృహ కూడా కోల్పోయి పడిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్‌ అని గుర్తించాలంటున్నారు. ఇక ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఓహియో స్టేట్ యూనివర్సిటీ వెక్సనర్ మెడికల్ సెంటర్ జరిపిన సర్వే ప్రకారం..10 శాతం మంది మహిళలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు. అలాగే ఈ బ్రెయిన్‌ స్ట్రోక్‌పై యూకేలో 1300 మందిపై జరిపిన సర్వేలో ఈ విషయాలు తేలాయి.

అధిక రక్త పోటు:

ఈ స్ట్రోక్‌ వచ్చే ముందు అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల మెదడులో రక్త గడ్డ కట్టే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు గర్భస్రావాలు జరుగుతుంటాయి. అది స్ట్రోక్ రిస్క్ ను పెరిగేలా చేస్తుందని అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ వెల్లడిస్తోంది. అడ్రినల్ గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే డీహెచ్ఈఏ హార్మోన్ వెంటనే తగ్గిపోతుంది. దాని కారణంగా ఈస్ట్రోజన్లు, ఆండ్రోజన్స్ తగ్గిపోతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే ఎక్కువగా టెన్షన్‌కు గురి కాకుండా ఉండటం మంచిది. అధికంగా ఆలోచించడం కంటే యోగా, ధ్యానం లాంటివి చేసుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలని వెల్లడిస్తున్నారు. లేకపోతే ఇలా ఆరోగ్యం బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం వైద్యులు హెచ్చరిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu