Egg Health Benefits: గుడ్డుతో అద్భుతమైన ప్రయోజనాలు.. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ పరిశోధనలలో కీలక విషయాలు

Egg Health Benefits: ప్రతి రోజు ఓ యాపిల్‌ పండు తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదనే మాటను గుడ్డు కూడా నిజం చేస్తుందంటున్నారు పరిశోధకులు..

Egg Health Benefits: గుడ్డుతో అద్భుతమైన ప్రయోజనాలు.. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ పరిశోధనలలో కీలక విషయాలు
Egg Health Benefits
Follow us
Subhash Goud

|

Updated on: Sep 19, 2022 | 5:30 AM

Egg Health Benefits: ప్రతి రోజు ఓ యాపిల్‌ పండు తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదనే మాటను గుడ్డు కూడా నిజం చేస్తుందంటున్నారు పరిశోధకులు. రోజుకో గుడ్డు తింటే అరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నమాట. అయితే చాలా మంది గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంద‌నే అపోహను పక్కన పెట్టేయాలని, ఎలాంటి అనుమానాలు లేకుండా రోజు గుడ్డు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతోంది మెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్. అయితే అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే.. అది ఒక్క గుడ్డులో మాత్రమేనని వివరిస్తోంది. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడ్డులో తొమ్మిది రకాల ప్రోటిన్లు, శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం ఉన్నాయి. అందుకే గుడ్డు శరీరానికి మల్టీ విటమిన్‌గా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. అయితే కొంతమంది గుడ్డుని ఉడక బెట్టుకుని తింటే.. మరికొందరు ఆమ్లెట్, కూరలు వంటివి చేసుకుని తింటారు. కొంతమంది గుడ్డులోని తెల్లని సొనని తిని.. పచ్చని సొన పడేస్తుంటారు. ఇంకొందరు ఉడకబెట్టి గుడ్డుని తింటే.. మరికొందరు పచ్చిగా తింటారు. ఇలా రకరకాలుగా తింటుంటారు. అయితే పచ్చిగా కోడిగుడ్డు తీసుకోవడం మంచిదా చెడ్డదా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అనే సందేహం చాలామందిలో వస్తుంటుంది.

గుడ్డుతో గుండె వ్యాధులు దూరం..

గుడ్డుతో గుండెకు సంబంధిత వ్యాధులు దూరం చేసుకోవచ్చని, ప్రతి రోజూ గుడ్డు తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ పెరుగుతుంద‌ని, ఇది గుండెకు మేలు చేకూరుస్తుంద‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ వెల్ల‌డించింది. నిత్యం గుడ్డు తీసుకోవ‌డం ద్వారా ప‌లు గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని చెబుతోంది.

ఇవి కూడా చదవండి

గుడ్డులో పుష్కలంగా ప్రోటీన్స్‌..

ప్రస్తుత కాలంలో కంటికి సంబంధిత సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. మొబైళ్లు, కంప్యూటర్లను వాడటం వల్ల కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వయసు పెరిగిన కొద్ది కంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. అయితే గుడ్డు వల్ల కంటికి సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. గుడ్డులో ఉండే లుటిన్‌, జెక్సాన్‌ధిన్ వంటివి కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే యాంటీఆక్సిడెంట్ల‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుడ్డులో ప్రొటీన్ పుష్క‌లంగా ఉండ‌టంతో శ‌రీర నిర్మాణం, ఎముక‌లు, కండ‌రాల పుష్టికి ఎంతగానో దోహదం చేస్తుంది. రోజువారీ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ప్రొటీన్‌ను గుడ్డు అందించ‌డం ద్వారా రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది. ఇక గుడ్డు తీసుకోవ‌డం ద్వారా శ‌రీరంలో జీవ‌క్రియ‌లు వేగ‌వంత‌మై బ‌రువు త‌గ్గేందుకూ ఇది దారితీస్తుంది.

మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ రాకుండా..

గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతుంది. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి. అలానే నరాల బలహీనత ఉన్న వారు రోజూ గుడ్డును తీసుకోవాలి. ఇది నరాల బలహీనత తగ్గేలా చేస్తుంది. గుండె జబ్బుల నివారణకు తోడ్పడుతుంది. ఉడకబెట్టిన గుడ్డు వల్ల జీర్ణ సమస్య దూరం అవుతుంది. ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?