Sleeping On Ground: నేలపై కాకుండా బెడ్‌పై నిద్రిస్తున్నారా? ఈ 5 అద్భుత ప్రయోజనాలను దూరం చేసుకుంటున్నట్లే..

Sleeping On Ground: నాడు అంటే నులక మంచం, పట్టే మంచాలు ఉండేవి. నేలపై నిద్రించినా, వాటిపై నిద్రించినా ఆరోగ్య పరంగా పెద్దగా తేడా ఏమీ లేకపోయేది.

Sleeping On Ground: నేలపై కాకుండా బెడ్‌పై నిద్రిస్తున్నారా? ఈ 5 అద్భుత ప్రయోజనాలను దూరం చేసుకుంటున్నట్లే..
Sleeping On Floor
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 18, 2022 | 1:44 PM

Sleeping On Ground: నాడు అంటే నులక మంచం, పట్టే మంచాలు ఉండేవి. నేలపై నిద్రించినా, వాటిపై నిద్రించినా ఆరోగ్య పరంగా పెద్దగా తేడా ఏమీ లేకపోయేది. కానీ, ప్రస్తుత కాలంలో మాత్రం ప్రజలు సౌకర్యానికి అలవాటు పడ్డారు. మెత్తటి పరుపులపై హాయిగా నిద్రిస్తున్నారు. పరుపు లేకపోతే నిద్ర పట్టని స్థితికి చేరుకున్నారు. వాస్తవం చెప్పాలంటే బెడ్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. అయినప్పటికీ మాత్రం నేటికీ నేలపై చాపలు వేసుకుని నిద్రపోయే వారు కూడా ఉన్నారు. ఎందుకంటే.. బెడ్ పై కంటే నేలపై పడుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని వారికి తెలుసు. అవును, నేలపై పడుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మంచి నిద్ర..

కొన్నిసార్లు మెత్తటి పరుపుపై పడుకున్నా సరిగా నిద్ర పట్టదు. మధ్య మధ్యలో ఇబ్బంది కలుగుతుంది. అలాంటి సమయంలో నేలపై, చాపపై నిద్రపోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. నేలపై పడుకోవడం వలన తొలుత కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. అలవాటు అవుతున్నా కొద్ది మంచి నిద్రను సొంతం చేసుకుంటారు. అదే సమయంలో ఆరోగ్యంగానూ ఉంటారు.

ఒత్తిడి, వెన్నునొప్పి నుంచి ఉపశమనం..

నేలపై పడుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మెంటల్ హెల్త్ కండీషన్ కూడా బాగుంటుంది. నేలపై పడుకోవడం వల్ల మనిషి శరీరాకృతి కూడా మెరుగవుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ ప్రకారం.. వెన్నునొప్పితో బాధపడుతున్న వ్యక్తులు కఠినమైన పడకలపై నిద్రపోవాలని సూచించారు. మీరు కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లయితే.. నేలపై పడుకోవడం ఉత్తమం.

వీరు మాత్రం నేలపై పడుకోవద్దు..

వృద్ధులు నేలపై పడుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే.. నడవడంలో ఇబ్బంది, ఎముకల్లో నొప్పి, తీవ్రమైన వెన్నునొప్పి, అలర్జీ వంటి ఏవైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు కూడా నేలపై పడుకోకూడదు. గర్భధారణ సమయంలోనూ నేలపై పడుకోకూడదు. గర్భం కారణంగా స్త్రీలలో వెన్నెముక కొద్దిగా వంగి ఉంటుంది. దీని కారణంగా నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే