Health News: రోజులో ఎన్ని వేప ఆకులు తినాలి?.. అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి మీకు తెలుసా..

వేప ఆకులు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అయితే, దానిని పరిమిత పరిమాణంలో తినండి. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. అవేంటంటే..

Health News:  రోజులో ఎన్ని వేప ఆకులు తినాలి?.. అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి మీకు తెలుసా..
Neem Leaves
Follow us

|

Updated on: Sep 21, 2022 | 10:00 AM

వేప ఆకుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దాని లక్షణాల గురించి ఎంత ఎక్కువ చర్చించినా.. అది తక్కువ అనే చెప్పాలి. మనలో చాలా మంది వేప చెట్టు గురించి మాట్లాడుకుంటారు. కానీ దానిలోని ప్రతి భాగం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. భారతదేశంలో దీనికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కడుపునొప్పి సమస్య అయినా, చర్మ సంబంధిత సమస్యలైనా సరే, ప్రతి చిన్న సమస్యలోనూ వేపను వాడటం మంచిది. మీ ఈ సమస్యలను దూరం చేయడంలో వేప ఆకులు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కానీ దాని అధికం ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. అవును, మీరు వేప ఆకులను అధికంగా తీసుకుంటే అది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.  మనం రోజుకు ఎన్ని వేప ఆకులను తినాలి అనే దాని గురించి తెలుసుకుందాం.

రోజులో ఎన్ని వేప ఆకులు తినాలి?

వేప ఆకులు మీ ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనవి. కడుపులో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షింస్తాయి. కానీ మీరు వేప ఆకులను ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది మీకు హాని కలిగిస్తుంది. రోజులో 6 నుంచి 8 వేప ఆకులను తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికి మించి వేప ఆకులను తీసుకోవడం వల్ల నష్టం జరుగుతుంది.

వేప ఆకులను ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు

మీరు వేప ఆకులను ఎక్కువ పరిమాణంలో తింటే, అది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. దాని గురించి తెలుసుకుందాం-

  • వేప ఆకులను క్రమం తప్పకుండా నమలడం వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇలాంటి సమయంలో మీరు పెద్ద పరిమాణంలో వేప ఆకులను నమిలితే.. అది చక్కెర స్థాయిని గణనీయంగా తగ్గిస్తుంది.
  • గర్భిణీ స్త్రీలు వేప ఆకులను తీసుకునే ముందు నిపుణుడిని సంప్రదించాలి.
  • వేప ఆకుల రసం కళ్లలో పడితే మంట, ఎర్రగా మారుతాయి. వేపాకు రసాన్ని జుట్టుకు రాసేటప్పుడు.. అది కళ్లలోకి వెళ్లకుండా చూసుకోండి.
  • వేపను ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి రుచి పోతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం