Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganpati Utsav: గణేష్‌ ఉత్సవాలతో రోడ్డుపై గుంతలు.. రూ.3.66 లక్షల ఫైన్‌ విధించిన మున్సిపల్ అధికారులు..

2017లో మండపానికి రూ.4.86 లక్షలు, 2015లో మండలానికి రూ.3.36 లక్షలు, 2014లో కమిటీకి రూ.5.56 లక్షలు జరిమానా విధించినట్టు సమాచారం.

Ganpati Utsav: గణేష్‌ ఉత్సవాలతో రోడ్డుపై గుంతలు.. రూ.3.66 లక్షల ఫైన్‌ విధించిన మున్సిపల్ అధికారులు..
Lalbaugcha Raja
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 21, 2022 | 7:32 PM

Ganpati Utsav 2022:  ఈ యేడు వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గత రెండు సంవత్సరాల కరోనా కాలం తర్వాత ఈ సంవత్సరం గణపతి నవరాత్రుల భారీ ఏర్పాట్లతో జరుపుకున్నారు భక్తులు. నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడు పదోరోజు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. అయితే, గణేష్ ఉత్సవాల సందర్భంగా అక్కడ రోడ్లన్నీ గుంతలు పడ్డాయట. అందుకు పరిష్కారంగా స్థానిక మున్సిపల్‌ అధికారులు ఉత్సవ కమిటీకి భారీ జరిమానా విధించారు. ఏకంగా ఒక్కో గుంతకు రెండు వేల రూపాయల చొప్పున ఫైన్‌ కట్టాలంటూ నోటీసులు అందజేశారు.. దీంతో ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలోని ప్రముఖ లాల్‌బాగ్‌చా రాజా గణేష్‌ ఉత్సవాల నిర్వహణ కమిటీకి భారీ జరిమానా విధించింది. మీ గణేష్‌ ఉత్సవాల కారణంగా రహదారిపై 183 గుంతలు పడి రోడ్డంతా పాడైపోయిందని నోటీసులు ఇచ్చింది. ఒక్కో గుంతకు రూ.2,000 చొప్పున మొత్తం రూ.3.66 లక్షలు చెల్లించాలని ఆదేశించింది బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ).

దీనికి సంబంధించి E వార్డ్ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన నోటీసులో డాక్టర్ బాబాసాహెబ్ రోడ్, TB కదమ్ మార్గ్ మధ్య ఉన్న రహదారి చెడిపోయిందని, ఈ రహదారిని సెప్టెంబర్ 5 న తనిఖీ చేశామని పేర్కొంది. బీఎంసీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రోడ్లు, ఫుట్‌పాత్‌లపై గుంతలు తవ్వి మండపాలను ఏర్పాటు చేయకూడదు. ఇప్పటికీ లాల్‌బాగ్‌చా రాజా మండలం గణేశోత్సవం సందర్భంగా టెంట్‌ నిర్మించేందుకు ఫుట్‌పాత్‌, రోడ్డుపై గుంతలు తవ్వినట్లు గుర్తించామని బీఎంసీ తెలిపింది.

గణేష్ పూజ వేడుకల కోసం గణేష్ మండపాలు ప్రతి సంవత్సరం తాత్కాలిక టెంట్లు నిర్మించడానికి BMC నుండి అనుమతి తీసుకుంటాయి. అనేక మండపాలు టెంట్లు నిర్మించడానికి రోడ్లపై గుంతలు తవ్వుతున్నారు. అయితే, పండుగ ముగిసిన తర్వాత BMC బృందం రోడ్లను తనిఖీ చేస్తుంది. ముఖ్యంగా లాల్‌బౌచా రాజా ముంబయిలోని ప్రముఖ గణేష్ మండపం చాలా పెద్దది. ఇక్కడ దర్శనం కోసం నగరం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే 2017లో మండపానికి రూ.4.86 లక్షలు, 2015లో మండలానికి రూ.3.36 లక్షలు, 2014లో కమిటీకి రూ.5.56 లక్షలు జరిమానా విధించారని గమనించాలి.

మరిన్ని జాతీయవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి