Viral News: సడెన్గా స్కూల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త స్టూడెంట్.. గదిలో బంధించిన గ్రామస్తులు.. ఎందుకంటే..
విద్యార్థుల ద్వారా అసలు విషయం తెలుసుకున్న గ్రామస్తులు కర్రలను తీసుకువచ్చి..ఆ కొత్త స్టూడెంట్ను గదిలో బంధించారు. ఇంతకీ గ్రామస్తులు ఆ అతిథిని ఎందుకు బంధించారు అనుకుంటున్నారా ?. అయితే అసలు విషయం తెలుసుకోవాల్సిందే.
పాఠశాలలోకి ఆకస్మాత్తుగా వచ్చిన ఓ కొత్త స్టూడెంట్ను చూసి విద్యార్థులతోపాటు టీచర్స్ సైతం షాకయ్యారు. వెంటనే ఆ ప్రాంగణం మొత్తం అరుపులు.. కేకలతో దద్దరిల్లింది. అక్కడున్న స్టూడెంట్స్ మొత్తం స్కూల్ నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇక ఉపాధ్యాయులు భయంతో వణికిపోయారు. విద్యార్థుల ద్వారా అసలు విషయం తెలుసుకున్న గ్రామస్తులు కర్రలను తీసుకువచ్చి..ఆ కొత్త స్టూడెంట్ను గదిలో బంధించారు. ఇంతకీ గ్రామస్తులు ఆ అతిథిని ఎందుకు బంధించారు అనుకుంటున్నారా ?. అయితే అసలు విషయం తెలుసుకోవాల్సిందే.
అలీఘర్ జిల్లాలోని అత్రౌలీ ప్రాంతంలోని కాసింపూర్ గ్రామంలోని పాఠశాలలోకి బుధవారం మొసలి ప్రవేశించింది. మొసలిని చూసిన పిల్లలు.. సిబ్బంది భయంతో వణికిపోయారు. అరుపులు, కేకలతో స్టూడెంట్స్ బయటకు పరిగెత్తడంతో గ్రామస్తులకు అసలు విషయం తెలిసింది. దీంతో వారంత కర్రలతో వచ్చి… ఆ మొసలిని మెల్లిగా ఓ గదిలోకి వెళ్లిపోయేలా చేశారు. అనంతరం ఆ గదికి తాళం వేశారు. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మొసలిని పట్టుకున్నారు. అత్రౌలీ ప్రాంతంలోని కాసింపూర్ గ్రామ సమీపంలో చాలా చెరువులు ఉండడంతో తరచూ అనేక మొసళ్లు గ్రామంలోకి వస్తున్నాయని.. దీనిపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. సమీపంలోనే గంగా నది కూడా ప్రవహిస్తుందని ..గతంలో వరదల కారణంగా ఈ మొసలి గ్రామంలోని ఏదో ఒక చెరువు వద్దకు వచ్చి ఉండవచ్చని, అక్కడి నుంచి పాఠశాలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు.