Aadhaar Voter ID Link: మీ ఓటర్‌ ఐడీకి ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేశారా..? ఇలా చేసుకోండి.. లేకపోతే ఇబ్బందే!

Aadhaar Voter ID Link: ఆధార్‌ను అన్నింటికి అనుసంధానం చేయాల్సి వస్తోంది. మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ కార్డును అన్నింటికి అనుసంధానించేలా చర్యలు చేపడుతోంది..

Aadhaar Voter ID Link: మీ ఓటర్‌ ఐడీకి ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేశారా..? ఇలా చేసుకోండి.. లేకపోతే ఇబ్బందే!
Aadhaar Voter Id Link
Follow us
Subhash Goud

|

Updated on: Sep 22, 2022 | 5:25 AM

Aadhaar Voter ID Link: ఆధార్‌ను అన్నింటికి అనుసంధానం చేయాల్సి వస్తోంది. మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ కార్డును అన్నింటికి అనుసంధానించేలా చర్యలు చేపడుతోంది. ఇక ఓటర్‌ ఐడీ కార్డుకు ఆధార్‌ నెంబర్‌ను అనుసంధానం చేయాలి. నకిలీ ఓట్లను అరికట్టడం, బోగస్‌ ఓటర్‌ ఐడీలను ఏరివేస్తూ పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఓటర్ల జాబితాలను ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆధార్‌ కార్డు లేకున్నా మరో పది గుర్తింపు పొందిన ధ్రువీకరణ పత్రాలతో ఓటరుగా పేరును నమోదు చేసుకోవచ్చు. వీటిలో.. గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీస్‌/బ్యాంక్‌ పాస్‌బుక్‌ , ప్రభుత్వం జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఇండియన్‌ పాస్‌పోర్ట్‌, పెన్షన్‌ డాక్యుమెంట్‌ విత్‌ ఫొటోగ్రాఫ్‌, సర్వీస్‌ ఐడెంటిటీ కార్డు విత్‌ ఫొటోగ్రాఫ్‌, అఫీషియల్‌ ఐడెంటిటీ కార్డు, యూనిక్‌ ఐడెంటిటీ ఐడీ కార్డులతో ఓటరుగా పేరును నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

  1. ఓటర్‌ ఐడీకి ఆధార్‌ నెంబర్‌ ఎలా లింక్‌ చేయాలి? ఎన్నికల సంఘం పోర్టల్‌, ఎస్ఎంఎస్ పంపడం ద్వారా, ఫోన్ ద్వారా ఆధార్ ఓటర్ ఐడీలను అనుసంధానం చేయవచ్చు. అలాగే గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో కూడా ఈ ప్రక్రియను చేస్తున్నారు.
  2. NVSP పోర్టల్‌ ద్వారా: ఈ లింకింగ్‌ను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎన్నికల సంఘం పోర్టర్ ద్వారా కూడా చేయవచ్చు. ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం పోర్టల్‌కు వెళ్లాలి. పోర్టల్‌లో మీ ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్‌ చేయాలి. పేరు, పుట్టిన తేదీ మొదలైన ఇతర వివరాలను ఎంటర్‌ చేయాలి. తరువాత మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి. దీంతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది. ఆధార్ ధ్రువీకరణ కోసం ఈ OTPని నమోదు చేయాలి. దీంతో ఆధార్‌ నెంబర్‌ లింక్‌ అవుతుంది.
  3. SMS ద్వారా: ఈ పని పూర్తి చేసేందుకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా చేయవచ్చు. ఇందుకోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మెసేజ్ పంపాల్సి ఉంటుంది. ఈ మెసేజ్‌ను 166 లేదా 51969కి పంపాలి. ECLINK స్పేస్ EPIC నంబర్ స్పేస్ ఆధార్ నంబర్ నమోదు చేసి కూడా లింక్‌ చేయవచ్చు.
  4. ఫోన్‌ చేయడం ద్వారా: ఫోన్ ద్వారా ఆధార్ ఓటర్ ఐడి కార్డులను లింక్ చేయడానికి భారత ప్రభుత్వం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఓటర్లు 1950 నంబర్‌కు కాల్ చేసి ఆధార్ నంబర్‌తో పాటు తమ ఓటర్ ఐడీ వివరాలను ఇవ్వాలి. మీ ఆధార్ ఓటర్ ఐడీ లింకింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక.. మొబైల్ ఫోన్‌లో దానికి సంబంధించిన మెసేజ్ వస్తుంది.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి