లారీల వెనుక Horn Ok Please అని ఎందుకు రాస్తారు..? దీని అర్థం ఏంటో తెలుసా..?

Horn Ok Please: మనం లారీలు, ఇతర వాహనాల వెనుక వైపున హార్న్‌ ఒకే ప్లీజ్‌ (Horn Ok Please) అని రాసి ఉండటం చూసే ఉంటాము. ఇలా రాయడం వెనుక..

లారీల వెనుక Horn Ok Please అని ఎందుకు రాస్తారు..? దీని అర్థం ఏంటో తెలుసా..?
Horn Ok Please
Follow us

|

Updated on: Sep 21, 2022 | 7:40 AM

Horn Ok Please: మనం లారీలు, ఇతర వాహనాల వెనుక వైపున హార్న్‌ ఒకే ప్లీజ్‌ (Horn Ok Please) అని రాసి ఉండటం చూసే ఉంటాము. ఇలా రాయడం వెనుక కూడా అర్థం దాగి వుంది. చాలా మంది ఇలాంటివి చూసినా పెద్దగా పట్టించుకోరు. వాహనాలకు ఏదైనా రాశారంటే దాని వెనుక అర్థం ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనం పెద్దగా పట్టించుకోము. మరి వాహనాల వెనుక ఉండే Horn Ok Please అంటే ఏమిటో తెలుసుకుందాం.

ఈ హార్న్‌ ఓకే ప్లీజ్‌ అనే పదాలు చూసిన వాహనదారులు అనవసరమైన హారన్‌ ఉపయోగించి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారనిక సెక్షన్‌ 134 (1) వాహన చట్టం కింద 2015 ఏప్రిల్‌ 30న మహారాష్ట్ర సర్కార్‌ వాహనాలపై Horn Ok Please అనే పదాలను బ్యాన్‌ చేసింది.

అయితే ట్రక్‌ రోడ్డుపై వెళ్తున్నప్పుడు దానిని ఎవరైనా ఓవర్‌ టెక్‌ చేయాలి అనుకుంటే ముందుగా హారన్‌ కొడతారు. దీంతో ముందు వాహనం నడిపే ట్రక్‌ డ్రైవర్‌ తన వెనుక మరో భారీ వాహనం వస్తోందని గమనించి వాళ్లు ఓవర్‌టెక్‌ చేయ్యాలనే ఉద్దేశంతో హారన్‌ కొట్టారని అర్థం చేసుకుంటారు. వెనుక వాహనానికి ముందున్న వాహన డ్రైవర్‌ దారి ఇస్తాడు. దీంతో వెనుకున్న వాహనదారుడు ఓవర్‌ టెక్‌ చేసి ముందుకెళ్తాడు.

ఇవి కూడా చదవండి

OK అంటే అర్థం ఏమిటి?

అయితే వాహనాల వెనుక ఓకే (OK) పదాన్ని సరదా కోసం రాస్తారేమో అనుకుంటారు. కానీ దీని వెనుక కూడా అర్థం ఉందని వాహనదారులు చెబుతుంటారు. ఈ ఓకే అనేది హార్న్‌ కొట్టు పర్వాలేదు అనే అర్థం వచ్చేలా ఈ OK అర్థం ఉందని భావిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో సింగిల్‌ రోడ్డు ఉండటం వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి రోడ్లలో చిన్న వాహనాలు మాత్రమే నడుస్తుంటాయి. కానీ కొన్ని సమయాల్లో ముందున్న పెద్ద వాహనం లాంటి లారీ ఉంటే ఓవర్‌ టెక్‌ చేయడానికి వీలుండదు. రోడ్డులో ఎదురుగా ఏ వాహనం వస్తుందో తెలిసేది కాదు. పెద్ద వాహనాన్ని దాటేందుకు వెనుకున్న వాహనదారులు హారన్‌ కొట్టగానే ముందున్న వాహనంలోని డ్రైవర్‌ OK అని అర్థం వచ్చేలా ఓ వైట్‌ కలర్‌ బల్బును వెలిగించేవారు. ఆ బల్బు వెలిగితే ఓవర్‌ టెక్‌ చేసుకోవచ్చని అర్థం.

Ok

okపదానికి ఇంకో అర్థం కూడా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ట్రక్‌ డ్రైవర్లు వాహనాలకు డీజిల్‌కు బదులుగా కిరోసాన్‌ వాడేవారు. డీజిల్‌ ఖర్చు తగ్గుతుందని ఇలా కిరోసిన్‌ను వాడేవారు. అయితే డీజిల్‌ కంటే కరోసిన్‌కు మండే స్వభావం ఉంటుంది. అందుకే వాహనం నడుపుతున్నట్లయితే ఆ వాహనం వెనుక OK రాసి ఉంఏది. ఇక్కడ ఓకే అంటే ఆన్‌ కిరోసిన్‌ (On Kerosene) అని అర్థం. ఈ పదం కనిపించగానే వెనుకన్న వాహనాలు మరీ దగ్గరకు రాకుండా జాగ్రత్త పడేవారు. కిరోసాన్‌ వాహనం కదా అని మరీ దగ్గరకు రాకుండా కొంత డిస్టాన్స్‌ పాటించేవారు. దీని వల్ల కరోసిన్‌ వల్ల ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా వెనుకున్న వాహనంకు ప్రమాదం కలుగకుండా ఉండేందుకు ఈ OK పదాన్ని రాసేవారట. నిపుణులు తెలుపుతున్న దాని ప్రకారం.. అలాగే ఇంటర్నెల్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఇలా అర్థాలు ఉన్నాయి.

Horn Ok Please1

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో