AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గిరిజన వేషధారణలో అమ్మాయిలు.. వెదురు కర్రలు వాయించిన అబ్బాయిలు.. చెరావ్‌ డ్యాన్స్‌తో దుమ్మురేపారు..

చెరవ్ డ్యాన్స్ లో ఆరు నుండి ఎనిమిది మంది వ్యక్తులు వెదురు కర్రలను ఒకదానిపై ఒకటి పట్టుకొని నేలపై అడ్డంగా ఉంచుతారు. సాధారణంగా.. మగవారు వెదురు కర్రలతో..

Viral Video: గిరిజన వేషధారణలో అమ్మాయిలు.. వెదురు కర్రలు వాయించిన అబ్బాయిలు.. చెరావ్‌ డ్యాన్స్‌తో దుమ్మురేపారు..
School Students
Jyothi Gadda
|

Updated on: Sep 22, 2022 | 4:28 PM

Share

Viral Video: భారతదేశం గొప్ప వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. మన దేశ సంస్కృతి, వారసత్వం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుజరాత్‌లోని అంబాచ్ గ్రామంలోని సరస్వతీ కన్యా విద్యాలయంలో మన సంస్కృతిలోని విస్తారమైన వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు విద్యార్థులు మిజోరాం సంప్రదాయ వెదురుకర్రలతో అలరించే డ్యాన్స్‌ చేసి అదరగొట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో తాపీ అంబాచ్ గ్రామంలోని సరస్వతి కన్యా విద్యాలయ విద్యార్థులు మిజోరాం సంప్రదాయ వెదురు నృత్యాన్ని చేశారు. దీన్నే చెరావ్ డ్యాన్స్ అని కూడా పిలుస్తారు.

సరస్వతీ కన్యా విద్యాలయంలోని ఉపాధ్యాయురాలు రీమా తెలిపిన వివరాల ప్రకారం.. చెరావ్ నృత్యం చేస్తున్న బాలికలు కూడా గిరిజన సమాజానికి చెందినవారని, వారు గత 2-3 సంవత్సరాలుగా ఈ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ అమ్మాయిలు గిరిజన సమాజానికి చెందినవారు. వివిధ సంస్కృతుల గురించి తెలుసుకునేలా వారికి కొత్త విషయాలు నేర్పించాలని మేము భావించాము. ప్రజలు ఇప్పుడు మమ్మల్ని ప్రదర్శనల కోసం ఫంక్షన్‌లకు ఆహ్వానిస్తున్నారు..అని రీమా చెప్పారు.

ఇవి కూడా చదవండి

చెరావ్ డ్యాన్స్ లేదా వెదురు నృత్యం అనేది మిజోరాంలో ప్రదర్శించబడే సాంప్రదాయ సాంస్కృతిక నృత్యం. ఇందులో ఆరు నుండి ఎనిమిది మంది వ్యక్తులు వెదురు కర్రలను ఒకదానిపై ఒకటి పట్టుకొని నేలపై అడ్డంగా ఉంచుతారు. సాధారణంగా.. మగవారు వెదురలతో చప్పట్లు కొడతారు. అందుకు తగ్గట్టుగా మహిళ నృత్యకారులు.. సమూహాలు కొట్టే వెదురుల మధ్య ఓ రిథమ్‌లో డ్యాన్స్‌ చేస్తారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి