Mohan Bhagawat: ముస్లిం మత పెద్దలతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మీటింగ్.. మోహన్ భగవత్ భేటీలపై సర్వత్రా ఆసక్తి

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోగన్ భగవత్.. ముస్లిం మత పెద్దలతో జరిపిస సమావేశం దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ముస్లిం మేధావుల బృందం ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో సమావేశమైంది. దేశంలో మత సామరస్యాన్ని..

Mohan Bhagawat: ముస్లిం మత పెద్దలతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మీటింగ్.. మోహన్ భగవత్ భేటీలపై సర్వత్రా ఆసక్తి
Mohan Bhagavat
Follow us

|

Updated on: Sep 22, 2022 | 4:27 PM

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోగన్ భగవత్.. ముస్లిం మత పెద్దలతో జరిపిస సమావేశం దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ముస్లిం మేధావుల బృందం ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో సమావేశమైంది. దేశంలో మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు వివరాలు వెల్లడించాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తాత్కాలిక కార్యాలయమైన ఉదాసి ఆశ్రమంలో క్లోజ్డ్ డోర్ సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశం దాదాపు రెండు గంటల పాటు జరిగింది. మత సామరస్యాన్ని బలోపేతం చేయడం, వర్గాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంపై వంటి అంశాలపై చర్చలు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. సయోధ్యను బలోపేతం చేయకుండా దేశం పురోగమించదని భగవత్, మేధావుల బృందం అంగీకరించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సమగ్ర సంక్షేమం కోసం గాంధేయ విధానాన్ని అనుసరించడంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆరెస్సెస్ పై ప్రజల్లో ఉన్న మతపరమైన భావనను తొలగించేందుకు గతంలోనూ పలు ప్రయత్నాలు చేసిన భగవత్.. ఇప్పుడు తాజాగా ముస్లింలను చేరువయ్యేందుకే ఇలా చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. ఢిల్లీలోని మసీదును సందర్శించి అక్కడన్న మతపెద్దలతో సమావేశమయ్యారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ప్రధాన మతగురువు ఉమర్ అహ్మద్ ఇలియాసీతో భేటీ అయ్యారు. తాము ఒక కుటుంబంలా చర్చించామని వారు తమ ఆహ్వానంపై రావడం అద్భుతంగా ఉందని ముస్లిం మతపెద్దలు చెప్పారు. కర్నాటకలో హిజాబ్ ఘటనల తర్వాత ఈ పరిణామం చాలా కీలకంగా భావిస్తున్నారు.

ఇప్పటికే మహమ్మద్ ప్రవక్తపై హింస, నిరసనలను ప్రేరేపించిన బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ ను బీజేపీ సస్పెండ్ చేసింది. ప్రతి మసీదు కింద ఒక శివలింగాన్ని వెతకాలి అని భగవత్ చేసిన ప్రకటన ఆవశ్యకతను ప్రశ్నిస్తూ ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 22న భగవత్ ఐదుగురు ముస్లిం మేధావులతో సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుత సామరస్య వాతావరణం గురించి తన ఆందోళనలను పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..