AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dowry Harassment: అదనపు కట్నం కోసం ఒళ్లంతా వాతలు పెట్టి.. అరుపులు బయటకు వినిపించకుండా నోరు మూసి..

ఎన్నో ఆశలతో అత్తింట్లోకి అడుగు పెట్టిన ఆ మహిళ ఆశలు గల్లంతయ్యాయి. అదనపు కట్నం కోసం సొంత అత్తమామలే తీవ్ర వేధింపులకు పాల్పడ్డాడు. డబ్బు తీసుకురావాలంటూ తీవ్రంగా కొట్టేవారు. వాతలు..

Dowry Harassment: అదనపు కట్నం కోసం ఒళ్లంతా వాతలు పెట్టి.. అరుపులు బయటకు వినిపించకుండా నోరు మూసి..
Woman Harassment
Ganesh Mudavath
|

Updated on: Sep 22, 2022 | 3:49 PM

Share

ఎన్నో ఆశలతో అత్తింట్లోకి అడుగు పెట్టిన ఆ మహిళ ఆశలు గల్లంతయ్యాయి. అదనపు కట్నం కోసం సొంత అత్తమామలే తీవ్ర వేధింపులకు పాల్పడ్డాడు. డబ్బు తీసుకురావాలంటూ తీవ్రంగా కొట్టేవారు. వాతలు పెట్టేవారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్ తో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. ఉత్తరాఖండ్ లోని టెహ్రీకి చెందిన ప్రీతి అనే మహిళ తన అత్తింట్లో కుటుంబంతో కలిసి నివాసముంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్నా్ళ్లు బాగానే ఉన్న కుటుంబసభ్యులు తర్వాత ఆమెను వేధించడం ప్రారంభించారు. అదనపు కట్నం తీసుకురావాలని తీవ్రంగా కొట్టేవారు. ఆమె ఫోన్ లాక్కుని, ఎవరినీ కలవనీయకుండా చిత్ర హింసలకు గురి చేశారు. కుమార్తె గురించి ఎలాంటి సమాచారం, ఫోన్ కాల్స్ లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ప్రీతి తల్లి సరస్వతీ దేవి ఆమె తన సోదరుడితో కలిసి ప్రీతి అత్తింటికి వెళ్లారు. అక్కడ వారికి షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. గాలిన గాయాలతో వంటింట్లో ప్రీతి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం ప్రీతి అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదనపు కట్నం పదేళ్లుగా తనను అత్తమామలు చిత్రహింసలకు గురిచేస్తున్నారని ప్రీతి ఆవేదన వ్యక్తం చేసింది. రెండు వారాలుగా తనను తీవ్రంగా వేధిస్తూ.. చంపేస్తానని బెదిరించేవారని చెప్పింది. చేతులు కట్టేసి కొట్టేవారని, చెవులు కోసి, వీపు, పొట్ట, తల భాగాల్లో వాతలు పెట్టారని కన్నీటిపర్యంతమైంది. బాత్రూమ్ లోపల పెట్టి, బయట గొళ్లెం పెట్టి తీవ్ర చిత్రహింసలకు గురి చేశారని ప్రీతి పోలీసులకు వివరించింది. అరుపులు బయటకు వినిపించకుండా నోరు మూసేసే వారని చెప్పింది. దాడి ఘటనకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్ ఛైర్‌ పర్సన్ ఈ విషయంపై తీవ్రంగా స్పిందించారు. అత్తామామలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..