Pakistan ISI Agent: భారత్‌కు నకిలీ నోట్లను సరఫరా చేసే పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్‌ హతం.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు!

భారత్‌లో నకిలీ కెరన్సీ నోట్లను పెద్ద మొత్తంలో సరఫరా చేసే ఐఎస్‌ఐ ఏజెంట్‌ హత్యకు గురయ్యాడు. పాక్‌ రాజధాని కాఠ్‌మాండూలో తన ఇంటి ముందు సెప్టెంబర్‌ 19న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యినట్లు ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు మీడియాకు..

Pakistan ISI Agent: భారత్‌కు నకిలీ నోట్లను సరఫరా చేసే పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్‌ హతం.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు!
Isi Agent Killed
Follow us

|

Updated on: Sep 22, 2022 | 2:10 PM

Pakistan ISI Agent killed in Nepal: భారత్‌లో నకిలీ కెరన్సీ నోట్లను పెద్ద మొత్తంలో సరఫరా చేసే ఐఎస్‌ఐ ఏజెంట్‌ హత్యకు గురయ్యాడు. పాక్‌ రాజధాని కాఠ్‌మాండూలో తన ఇంటి ముందు సెప్టెంబర్‌ 19న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యినట్లు ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు మీడియాకు తెలిపాయి. నిఘా వర్గాలు తెల్పిన వివరాల ప్రకారం..

హతుడు ఏజెంట్‌ లాల్‌ మహమ్మద్‌ (55) అలియాస్ మహ్మద్ దర్జీగా పిలవబడేవాడు. లాల్ మహ్మద్ పాకిస్థాన్‌, బంగ్లా నుంచి ఇండియాకి ఫేక్‌ ఇండియన్‌ కరెన్సీని పెద్ద మొత్తంలో నేపాల్‌కు సరఫరా చేసే వాడు. అక్కడి నుంచి భారత్‌కు అక్రమంగా సరఫరా చేసేవారు. ఇతనితో వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌తో సంబంధాలు కూడా ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అనేక ఐఎస్‌ఐ ఏజెంట్లకు కూడా నేపాల్‌లో ఆశ్రయం కల్పిస్తున్నాడు. ఐతే ఈ క్రమంలో ఖాట్మండులోని గోతాటర్ ప్రాంతంలో ఉన్న లాల్ మహ్మద్ ఇంటి ముందు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. కాల్పుల సమయంలో లాల్ మహ్మద్ తన కారు వెనుక దాక్కోవడానికి ప్రయత్నించినప్పటికీ దుండగులు వెంటాడి మరీ కాల్పులు జరిపారు. తుపాకి శబ్ధాలు విన్న లాల్ మహ్మద్ కుమార్తె తన తండ్రిని రక్షించుకోవడానికి ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి దూకిన సన్నివేశాలు కూడా సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆమె తన తండ్రి మహ్మద్‌ను సమీపించేలోగా దుండగులు పరారయ్యారు.