- Telugu News Photo Gallery Chanakya Niti According to Chanakya These 4 Things are very Important in Life Know the details
Chanakya Niti: ఈ నాలుగు విషయాలు జీవితంలో చాలా కీలకమైనవి.. ఆచార్య చెప్పిన ఆ విశేషాలేంటంటే..
ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో సంబంధాలు, విద్య, వ్యాపారం, ఉద్యోగానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు. జీవితంలో విజయం సాధించడానికి అనుసరించాల్సి మార్గాలను కూడా నీతిశాస్త్రంలో ప్రస్తావించారు. ఆ విషయాలు ఏంటో ఇవాళ తెలుసుకుందాం.
Updated on: Sep 22, 2022 | 2:25 PM

వాదించుకోవడం - ఆచార్య చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు కించపరుచుకుంటూ మాట్లాడకూడదు. గొడవలు పడకూడదు. ఒకరికొకరు ఎప్పుడూ గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ ఉండాలి. పిల్లల దృష్టిలో తల్లిదండ్రుల మీద గౌరవం పెరుగుతుంది.

గౌరవం: చాణక్యుడి నీతి ప్రకారం, గౌరవం మనుషుల మధ్య బలమైన, దీర్ఘకాలిక సంబంధాన్ని కొనసాగేలా చేస్తుంది. ఏదైనా సంబంధంలో గౌరవం లేనప్పుడు, సంబంధం వెలసిన దుస్తులా మారుతుంది. గౌరవం ఉన్న సంబంధం ఆనందం ముగుస్తుంది. ప్రతి బంధానికి పరిమితులు ఉంటాయి. ఈ పరిమితిని ఎవరూ దాటకూడదు.

ఆహారం - ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఒక వ్యక్తి ఇంట్లో ఎప్పుడూ ఆహారాన్ని ఎల్లపుడూ నిల్వ ఉంచుకోవాలి. దీని వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడూ నివసిస్తుందని నమ్ముతారు. ఇంటికి వచ్చిన అతిథిని ఎప్పుడూ ఆకలితో ఉంచకూడదు.

భాష విషయాల్లో అదుపు- ఆచార్య చాణక్యుడు ప్రకారం, పిల్లల ముందు ఎప్పుడూ ఒకరినొకరు దూషించుకుంటూ మాటలు మాట్లాడకూడదు. భాష విషయంలో పిల్లల ముందు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. పిల్లల ముందు మంచి భాషను ఉపయోగించండి. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువు. పిల్లలు భాషను మొదట తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు.

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఆచార్య చాణక్య ప్రకారం, పిల్లల ముందు కుటుంబ సభ్యులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. పిల్లల ముందు పొరపాటున కూడా కొన్ని పనులను చేయవద్దని ఆచార్య సూచించారు. ఆ పనులు ఏంటో తెలుసుకుందాం.





























