Video Viral: ఈ ఆర్టిస్ట్ పనితనానికి శెభాష్ అనాల్సిందే.. చెక్కతో ఏకంగా అద్భుతాన్ని సృష్టించేశాడు..
సువిశాల ప్రపంచంలో ట్యాలెంట్ కలిగిన వాళ్లు చాలా మందే ఉన్నాయి. ఒకటి లేదా అంతంటే ఎక్కువ ట్యాలెంట్ ఉన్నవాళ్లూ ఉన్నారు. వారు తమ కళలు, స్కిల్స్ తో అందరితో ఆశ్చర్యపరచడంతో పాటు ఆకర్షిస్తుంటారు. కొన్ని పేపర్లు..
సువిశాల ప్రపంచంలో ట్యాలెంట్ కలిగిన వాళ్లు చాలా మందే ఉన్నాయి. ఒకటి లేదా అంతంటే ఎక్కువ ట్యాలెంట్ ఉన్నవాళ్లూ ఉన్నారు. వారు తమ కళలు, స్కిల్స్ తో అందరితో ఆశ్చర్యపరచడంతో పాటు ఆకర్షిస్తుంటారు. కొన్ని పేపర్లు పెన్నుతో అందమైన పెయింటింగ్స్ వేస్తే, మరికొంత మంది ఇసుక మీద అందమైన ఆర్ట్ ను వేస్తారు. మరికొంత మంది 3D ఆర్ట్‌లను వేస్తారు. చాలా తక్కువ మంది మాత్రం చెక్కతో అద్భుతమైన కళాఖండాలు తయారు చేస్తారు. దీనినే ‘ వుడ్ ఆర్ట్ ‘ అంటారు. చెక్క పై ఆర్ట్ వేయడం అనేది అంత సులభమైన పని కాదు. ఇందుకు చాలా కష్టపడాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తం దుంగ పనికి రాకుండా పోతోంది. ఇలాంటి ఆర్ట్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. అంతే కాకుండా వాటిని చూసేందుకూ నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఓ వ్యక్తి చెక్కను అందంగా, జాగ్రత్తగా కత్తిరిస్తాడు. సరిగ్గా తల్లి గర్భం, అందులో ఉన్న శిశువు కళాకండాన్ని తయారు చేస్తాడు. ఈ కళ నిజంగా ఏదో మేజిక్ లాగా కనిపిస్తుంది. చెక్కను కోసి ఇంత అందంగా చెక్కడం అందరి పని కాదు.
ఇది కేవలం కొన్ని సెకన్ల వీడియో మాత్రమే, అయితే ఈ ఆర్టను తయారు చేయడానికి ఎంత సమయం పట్టిందనేది దీన్ని రూపొందించిన ఆర్టిస్ట్‌కే తెలుస్తుంది. ఈ అందమైన వుడ్ ఆర్ట్ వీడియో @Artsandcultr అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘గ్రేట్ వుడ్ ఆర్ట్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. కేవలం 10 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షకు పైగా వ్యూస్, 3 వేల మందికి పైగా లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను రకరకాలుగా కామెంట్లు రూపంలో రాస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..