AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Helmet AC: కూలింగ్‌ హెల్మెట్‌.. బటన్‌ నొక్కగానే ఏసీ ఆన్‌.. మీకు అందుబాటు ధరలోనే..

ఈ ఫ్యాన్‌లో బలమైన ప్లాస్టిక్ బాడీ కలిగి ఉంటుంది. ఇది తేమను సమతుల్యం చేస్తుంది. అద్భుతమైన చల్లదనాన్ని అందిస్తుంది.

Helmet AC: కూలింగ్‌ హెల్మెట్‌.. బటన్‌ నొక్కగానే ఏసీ ఆన్‌.. మీకు అందుబాటు ధరలోనే..
Helmet Ac
Jyothi Gadda
|

Updated on: Sep 22, 2022 | 6:50 PM

Share

Helmet AC: మనదేశంలో వేసవి కాలం చాలా ఎక్కువ. దీంతో హెల్మెట్‌ పెట్టుకుని బండినడిపేందుకు ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. పై నుంచి ఎండవేడి, హెల్మెట్‌ ఉష్ణోగ్రత, ఉక్కపోతతో సతమతమవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో బైక్ నడుపుతున్నప్పుడు రైడర్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. నిజానికి హెల్మెట్ యొక్క ముదురు రంగు, లోపల కుషన్ కారణంగా హెల్మెట్‌ ఎక్కువ వేడేక్కటంతో బైక్‌ రైడర్లు సమస్యలు ఎదుర్కొంటారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఈ పరికరం సహాయంతో రైడింగ్ చేసేటప్పుడు మీ తలని చల్లగా ఉంచుకోవచ్చు. వేడి నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పరికరం హెల్మెట్ కూలింగ్ పరికరం.. ఇది వేసవిలో రైడింగ్ చేసేటప్పుడు మీకు ఉపశమనం ఇస్తుంది. ఇది చాలా శక్తివంతమైనది. ఇది హెల్మెట్‌ను చల్లబరుస్తుంది. ఈ హెల్మెట్‌ ధరించి బైక్‌ డ్రైవ్‌ చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం కూడా వేడిలో ప్రయాణించినట్లు అనిపించదు. ఈ సాధనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజంగా మీరు దీన్ని వాడి చూస్తే చాలా ఆనందిస్తారు.

ప్రత్యేకత ఏమిటి..? ధర ఎంత? హెల్మెట్ కూలింగ్ పరికరాలను తయారు చేసే అనేక కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. వీటిలో బ్లూ ఆర్మర్ అనే కంపెనీ ఒకటి. ఈ కంపెనీయే ఈ పరికరాన్ని తయారు చేస్తుంది. దీని ధర రూ.1,999, రూ.2,299 నుండి రూ.4,999 వరకు ఉన్నాయి.. ఈ పరికరం బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులో శక్తివంతమైన ఫ్యాన్‌ని కలిగి ఉంటుంది. దీనితో పాటు, ఇందులో ఒక మోటార్‌ అమర్చబడి ఉంటుంది. ఇది ఫ్యాన్‌ తిరిగేలా పనిచేస్తుంది. ఈ ఫ్యాన్‌లో బలమైన ప్లాస్టిక్ బాడీ కలిగి ఉంటుంది. ఇది తేమను సమతుల్యం చేస్తుంది. అద్భుతమైన చల్లదనాన్ని అందిస్తుంది. దాంతో మీరు భగభగ మండే ఎండలో కూడా హెల్మెట్‌ పెట్టుకుని హాయిగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ న్యూస్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి