Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meesho Employees: తమ ఉద్యోగులకు 11 రోజులు సెలవులు ప్రకటించిన భారతీయ ఇ-కామర్స్ కంపెనీ.. రీజన్ తెలిస్తే వావ్ అంటారు..

ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. మీషో వరుసగా రెండవ సంవత్సరం కూడా ఇటువంటి సెలవులను ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

Meesho Employees: తమ ఉద్యోగులకు 11 రోజులు సెలవులు ప్రకటించిన భారతీయ ఇ-కామర్స్ కంపెనీ.. రీజన్ తెలిస్తే వావ్ అంటారు..
Meesho E Commerce Company
Follow us
Surya Kala

|

Updated on: Sep 22, 2022 | 3:29 PM

Meesho Employees: తన ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఒక భారతీయ ఇ-కామర్స్ కంపెనీ  సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. కంపెనీలో పని చేసే ఉద్యోగులు మనస్ఫూర్తిగా సంతోషంగా పని చేయాలనుకుంటుంది. తన ఉద్యోగులకు 11 రోజుల పాటు ‘ రీసెట్ అండ్  రీఛార్జ్ బ్రేక్ ‘ ఇవ్వనున్నామని మీషో సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే వారి మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందని కంపెనీ భావిస్తోంది. దీనితో పాటు, వారు మరింత కష్టపడి, మరింత శ్రద్ధగా పని చేస్తారని .. ఈ సెలవులను పండుగల సీజన్ తర్వాత ఇవ్వనున్నామని మీషో యాజమాన్యం తెలిపింది.

ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. మీషో వరుసగా రెండవ సంవత్సరం కూడా ఇటువంటి సెలవులను ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఇలా సెలవులను ఇవ్వడం.. ఉద్యోగులకు పని నుండి పూర్తి విరామం ఇవ్వడమే కాకుండా.. పండుగ సీజన్ తో బిజీ షెడ్యూల్ తో గడిపిన వారికి రిలీఫ్ ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు ఇలా సెలవులు ఇవ్వడం మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అని కూడా భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు మీషో వ్యవస్థాపకుడు, CTO సంజీవ్ బర్న్వాల్ బుధవారం ఒక ట్వీట్ చేశారు. మంచి మానసిక ఆరోగ్యంతో ఉన్నవారు ఉద్యోగిగా తమ విధులను,  జీవితాన్ని సమతుల్యం చేస్తారు. అందువల్ల, వరుసగా రెండవ సంవత్సరం మేము మా ఉద్యోగులకు 11 రోజుల విరామం ఇస్తున్నట్లు ప్రకటించాము. దీంతో పాటు పండుగల సీజన్‌లో రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకు ఈ సెలవులు ఇస్తున్నట్లు సంజీవ్ తెలిపారు.

కంపెనీ ఉద్యోగుల విరామానికి సంబంధించి కంపెనీ సీఈవో విదిత్ అత్రే కూడా ఓ ట్వీట్ చేశారు. పని ముఖ్యం.. అయితే ఉద్యోగి మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ముఖ్యం. మీషోలో ‘మూన్‌షాట్ మిషన్స్’లో పనిచేసే వ్యక్తులకు కూడా విరామం అవసరమని తెలిపారు. అందుకనే తాము తమ కంపెనీ ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నామని ప్రకటించారు.

ఇంతకుముందు, కంపెనీ 30 వారాల పేరెంటల్ లీవ్‌ను ప్రకటించడం ద్వారా వెలుగులోకి వచ్చింది. అప్పుడు కంపెనీ తన ఉద్యోగి పిల్లల ప్రాథమిక సంరక్షకుడైతే.. అప్పుడు ఆ ఉద్యోగి ఒక సంవత్సరం సెలవు తీసుకోవడానికి అర్హుడని చెప్పింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు ప్రశంసల వర్షం కురిపించారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..