Gold Silver Price: షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు..
Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో ధరలు ఒక్కోసారి పెరిగితే..
Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. ఇటీవల తగ్గిన బంగారం, వెండి ధరలు తాజాగా, మళ్లీ పెరిగాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.46,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.200, 24 క్యారెట్లపై రూ.240 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.600 మేర పెరిగి.. రూ.54,800 లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,200గా ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200లుగా ఉంది.
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200 గా కొనసాగుతోంది.
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350 ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200 లుగా ఉంది.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000గా కొనసాగుతోంది.
- కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200 ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,240 గా ఉంది.
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200 గా ఉంది.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,000 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.58,000గా ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.63,000, బెంగళూరులో రూ.63,000, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.63,300, విజయవాడలో రూ.63,000, విశాఖపట్నంలో రూ.63,000 లుగా కొనసాగుతోంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..