Viral Video: నడిరోడ్డుపై కొట్టుకుంటున్న విద్యార్థులు.. వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు.. వైరలవుతున్న వీడియో

ప్రాథమిక విచారణ అనంతరం కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వైరల్ వీడియోలో కనిపిస్తున్న కారును కూడా సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు.

Viral Video: నడిరోడ్డుపై కొట్టుకుంటున్న విద్యార్థులు.. వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు.. వైరలవుతున్న వీడియో
Car Hitting
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 22, 2022 | 6:04 PM

Viral Video: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో చిన్నారుల చిలిపి చేష్టలు, స్కూల్ పిల్లల అల్లరి పనులు, కాలేజీ విద్యార్థులు చేసే వినూత్న ప్రయత్నాలు, గొడవలు, కొట్లాటలు వంటివి అనేకం నిత్యం వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా..నడి రోడ్డుపై పోరాడుతున్న ఇద్దరు యువకులను వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దాంతో ఆ ఇద్దరు యువకులు ఎగిరి అంతదూరంలో పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 23 సెకన్ల వ్యవధి గల ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లాకు చెందినదిగా తెలిసింది. ఘజియాబాద్‌లోని మసూరి ప్రాంతంలో కొందరు విద్యార్థులు నడిరోడ్డుపైనే వాగ్వాదానికి దిగారు. అది వాహనాల రద్దీగా ఎక్కువగా ఉన్న ప్రాంతంగా తెలుస్తుంది.

అయితే,రోడ్డుపైనే విద్యార్థులు గొడవపడుతుండగా,.. అకస్మాత్తుగా తమ వైపు వెళ్తున్న కారును చూసి వారు పక్కకు తప్పుకునేందుకు పరిగెత్తారు. కానీ, వెనకనుంచి వచ్చి మరో కారు ఆ యువకులను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు అప్పుడు కారు వేగం అదుపులో ఉండటంతో యువకులు పక్కకు ఎగిరిపడ్డారు తప్ప ఎలాంటి అపాయం కలుగలేదు. వాహనం వారిని వెనుక నుంచి ఢీకొట్టడంతో విద్యార్థి కాలి చెప్పులు మాత్రమే ఊడిపడిపోయాయి. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ విద్యార్థులు తిరిగి తమ గొడవను ఆపలేదు. పడిలేచిన తర్వాత కూడా ఘర్షణ పడ్డారు. ఇరువురు కాలర్‌ పట్టుకుని బాహాబాహికి దిగారు.

ఇవి కూడా చదవండి

మసూరి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కొంతమంది కళాశాల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలో ఒక కారు వారిలో కొందరిని ఢీకొట్టింది. ప్రాథమిక విచారణ అనంతరం కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు అని పోలీసుల తెలిపారు. ఇక వైరల్ వీడియోలో కనిపిస్తున్న కారును కూడా సీజ్ చేశామని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?