AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Song Controversy : ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు.. ? బూతు పాటపై దర్శకుడి భార్య రియాక్షన్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర వివాదాస్పదమైన పాట సర్కే చునార్ తేరీ సర్కే. కన్నడ డైరెక్టర్ ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్న కేడీ : ది డెవిల్ సినిమాలోనిది ఈ సాంగ్. ఇటీవల విడుదలైన ఈ పాటపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అసభ్యకరమైన పదాలు.. నోరా ఫతేహి డ్యాన్స్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇదివరకే ఈ పాటపై అటు కేంద్రం సైతం సీరియస్ అయ్యింది.

Song Controversy : ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు.. ? బూతు పాటపై దర్శకుడి భార్య రియాక్షన్..
Rakshitha Prem
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2026 | 11:06 AM

Share

కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా నటించిన ‘కేడీ’ చిత్రంలోని సర్కే చునార్ తేరీ సర్కే పాట తీవ్ర వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ స్పెషల్ పాటలో డబుల్ మీనింగ్ పదాలు ఉన్నాయని.. అలాగే నోరా ఫతేహి డ్యాన్స్ అత్యంత దారుణంగా.. జుగుప్సాకరంగా ఉందంటూ నెటిజన్స్ మండిపడ్డారు. హిందీ వెర్షన్ సాహిత్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది. అటు ఈ పాటపై కేంద్రం సైతం సీరియస్ అయ్యింది. వెంటనే అన్ని సోషల్ మీడియా ఫార్మాట్స్ నుంచి ఈ పాటను డిలీట్ చేయాలని ఆదేశించింది. ఈ సాంగ్ సాహిత్యంపై పలువురు సినీ ప్రముఖులు సైతం మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ పాట వివాదంపై చిత్రయూనిట్ కు నోటీస్ జారీ అయ్యింది.

హిందీలో ‘సర్కే చునార్’ అనే పదాలతో మొదలయ్యే ఈ పాటను సింగర్ మంగ్లీ పాడింది. ఈ పాటలోని అసభ్యకరమైన, అశ్లీలమైన సాహిత్యంపై క్రికెటర్ హర్భజన్ సింగ్, గాయకుడు అర్మాన్ మాలిక్, కంగనా రనౌత్ సీరియస్ అయ్యారు. కొందరు సినిమా డైరెక్టర్ ప్రేమ్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. అద్భుతమైన పాటలు ఇచ్చే ప్రేమ్ ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పుడు డైరెక్టర్ ప్రేమ్ భార్య.. ఒకప్పటి హీరోయిన్ రక్షిత ఘాటుగా స్పందించారు. ఇన్ స్టా వేదికగా సుధీర్ఘ నోట్ విడుదల చేశారు.

“నాకు తెలుసు.. మీరు కొంతమంది పోస్టులలో నన్ను ట్యాగ్ చేస్తున్నారు.. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను దాన్ని సమర్థించినా, వ్యతిరేకించినా ఫరవాలేదు. నా వ్యక్తిగత అభిప్రాయం పక్కనపెడితే..గతంలో ‘పీలింగ్స్’, ‘డ్రీమ్ వేకప్’, ‘చోలీ కే పీచే క్యాహై’ లాంటి పాటలు వచ్చినప్పుడు వందలాది పాటలు వచ్చినప్పుడు అందరికీ అవి సాధారణంగానే అనిపించాయి. శృంగారమే ప్రధానంశంగా సినిమాలు వచ్చినప్పుడు కూడా ఎవరికీ ఏ ఇబ్బంది కలగలేదు. కానీ ఈ ఒక్క పాట విషయంలోనే ఇంత గందరగోళం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. నేను దీనిని సమర్థించడం లేదు. కానీ ఈ వివక్షను అర్థం చేసుకోవాలని అర్థం చేసుకోవాలని పోస్ట్ పెడుతున్నాను.

ఒకప్పుడు ప్రేమ్ ప్రతిభను మెచ్చుకున్నవారే ఇప్పుడు అతని గురించి చెడుగా మాట్లాడుతున్నారు. అతని ప్రతిభ ఇప్పుడు ద్వితీయ స్థానానికి పడిపోయింది. ఈ ఒక్క పాట కారణంగా, గతంలో మంచి పాటలు రాసిన వారందరూ చెడ్డ రచయితలు అని గానీ, గిమ్మిక్కుల కోసం అన్నీ చేస్తారని గానీ అర్థం కాదని రక్షిత అన్నారు. “కొన్ని సినిమాలు పెద్ద విజయం సాధించలేదంటే, వారు చెడ్డ దర్శకులు అయిపోరు… వారిని ప్రశ్నించే హక్కు మీకు ఉంది, కానీ వారిని అవమానించే హక్కు మీకు ఉందా??? లేదు… మీకు ఆ హక్కు లేదు… ఎవరైనా అతని గురించి చెడుగా మాట్లాడితే, అది వ్యక్తిగతమా…?” అని ఆమె ప్రశ్నించారు.

నాకు నా భాష, నా ప్రజలంటే చాలా ఇష్టం… బహిరంగంగా ఒకరి గురించి మాట్లాడేటప్పుడు కనీస అవగాహన ఉండాలి. మాకు ప్రశ్నలు ఎదురవుతాయి… మాపై జోకులు వేస్తుంటారు. ఇది కేవలం ప్రేమ్ విషయంలోనే కాదు. నేను ఎక్కడికి వెళ్లినా, కొంతమంది నాపై చెడు వ్యాఖ్యలు చేస్తారు అంటూ రాసుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

Follow Us