Dasara Holidays: వారికి దసరా ముందస్తు సెలవులు.. ఆ ప్రాబ్లంతో ముందుగానే ఇంటికి వెళ్తున్న స్టూడెంట్స్
దసరా సెలవులు ఈనెల26 నుంచి ప్రభుత్వం ఎనౌన్స్ చేసినప్పటికి ఆ హాస్టల్ విద్యార్థులకు మాత్రం 22 నుంచి వచ్చాయి. ఆస్కూల్ ఎక్కడ?.. మందే సెలవులు రావడానికి గల కారణాలేంటో చూద్దాం.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు ముందుగానే దసరా సెలవులు వచ్చాయి. స్కూల్ రావాలన్నా.. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లాలన్న ముందు వాగు దాటాల్సిందే.. దీంతో ఈనెల 22 నుంచి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు. వర్షాలు వస్తే.. వాగు పొంగుతుందేమోనన్న భయంతో పిల్లల్ని తీసుకెళ్తున్నామని చెప్తున్నారు తల్లిదండ్రులు. వాగు దాటిరావాలంటే మాకే భయంగా ఉందని చెప్తున్నారు పిల్లల పేరెంట్స్. దీంతో సెలవులకు నాలుగు రోజుల ముందే వచ్చి పిల్లలను ఇంటికి తీసుకెళ్తున్నారు పేరెంట్స్. నిన్న ఒక్కరోజే ఖానాపూర్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నుండి 180 మంది విద్యార్థులను ఇంటికి వెళ్లినట్లు రిజిస్టర్‌లో నమోదైంది. వాగు ప్రాబ్లమ్ తోనే ముందస్తుగా విద్యార్థులు ఇంటికి వెళ్తున్నారని టీచర్స్ చెబుతున్నారు.
తల్లిదండ్రులు తీసుకెళ్తామని అడగడంతో పంపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 26 నుంచి దసరా సెలవులు ప్రకటించింది. అటు ప్రభుత్వం, ఇటు అధికారులు స్పందించి వాగు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. భారీ వర్షాలు కురిస్తే తీవ్రంగా ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా సెలవులు..
ప్రధాన పండుగలైన బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో విద్యాసంస్థలకు భారీగా సెలవులు ప్రకటిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. స్కూళ్లకు ఇప్పటికే 15 రోజుల పాటు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిదే. అయితే సెలవులను తగ్గించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (SCERT) అభ్యంతరం వ్యక్తం చేసినా విద్యాశాఖ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సెలవులను తగ్గించేది లేదని స్పష్టం చేసింది.
అయితే.. తాజాగా ఇంటర్ బోర్డ్ సైతం సెలవులపై కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కాలేజీలకు అక్టోబర్ 2 నుంచి 9 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వ కాలేజీలన్నింటికీ ఈ సెలవులు వర్తిస్తాయిని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులకు 8 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం