Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: “చరిత్ర, వారసత్వ సంపద గురించి భవిష్యత్ తరాలు తెలుసుకోవాలి”.. విద్యార్థులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచన..

మ్యూజియాలు విజ్ఞాన గనులు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. చరిత్ర, వారసత్వ సంపద గురించి విద్యార్థులు తెలుసుకోవాలని కోరారు. ఇందు కోసం మ్యూజియాలను సందర్శించడం, పాఠ్య ప్రణాళికలో భాగం...

Kishan Reddy: చరిత్ర, వారసత్వ సంపద గురించి భవిష్యత్ తరాలు తెలుసుకోవాలి.. విద్యార్థులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచన..
Kishan Reddy
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 22, 2022 | 8:08 PM

మ్యూజియాలు విజ్ఞాన గనులు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. చరిత్ర, వారసత్వ సంపద గురించి విద్యార్థులు తెలుసుకోవాలని కోరారు. ఇందు కోసం మ్యూజియాలను సందర్శించడం, పాఠ్య ప్రణాళికలో భాగం కావాలని సూచించారు. మన చరిత్ర, వారసత్వ సంపద గురించి భవిష్యత్ తరాలు తెలుసుకునేందుకు మ్యూజియాలు సరైన వేదికలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు మ్యూజియాలను సందర్శించడాన్ని తమ పాఠ్యప్రణాళికలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. వివిధ అంశాలపై అవగాహన పెంచుకుని దాన్ని మన చరిత్ర, వర్తమానం, భవిష్యత్తులతో అనుసంధానం చేసుకోవడం అత్యంత అవసరమని అన్నారు. గురువారం ఢిల్లీలో (Delhi) ఓ ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. మన పూర్వీకులు, స్వాతంత్ర్య సమరయోధులు, దేశంలోని వివిధ చారిత్రక ప్రాంతాలు, అక్కడి సంప్రదాయాలు, ప్రత్యేకతలు, మన పూర్వీకులు వినియోగించిన ఆయుధాలు, నాటి వస్త్ర సంపద, వాటి నేయడంలో మనవాళ్ల కళాత్మక ఆలోచనలు వంటి ఎన్నో విషయాలను ప్రయోగాత్మకంగా తెలుసుకునేందుకు మ్యూజియాలు ఉపయోగపడతాయని కొనియాడారు.

పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మ్యూజియాల నిర్వాహకులు అలవరచుకోవాలని, త్రీడీ సాంకేతికతతో బులెటిన్ బోర్డుల ఏర్పాటు, స్క్రీన్ ను టచ్ చేయగానే ఆ వస్తువు విశిష్టత తెలిసేలా ఏర్పాట్లు చేయడం ద్వారా సందర్శకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్, నేతాజీ విగ్రహం, ఇండియాగేట్, ప్రధానమంత్రి సంగ్రహాలయం వంటి వాటిని సందర్శించడం ద్వారా విద్యార్థులు చాలా విషయాలను నేర్చుకుంటారన్నారు. మన చరిత్రను తెలుసుకోవడంతో పాటు దాన్నుంచి స్ఫూర్తి పొందేందుకు వీలవుతుందని కేంద్ర మంతరి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ, క్రీడా వార్తల కోసం