Big News Big Debate: HCAలో దొంగలుపడ్డారు.. ఇంత రచ్చ ఎక్కడా చూడలేదే..?

Ram Naramaneni

|

Updated on: Sep 22, 2022 | 7:05 PM

దేశంలో ఎక్కడ క్రికెట్‌ మ్యాచ్‌ జరిగినా టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్ముతారు.. వారం ముందు ఆఫ్‌లైన్‌లోనూ విక్రయిస్తారు. కానీ HCA రూటే సపరేటు. అక్కడా లేవు.. ఇక్కడా లేవు. ఎక్కడ దొరుకుతాయో కూడా ఎవరికీ తెలియదు.

అసలే అవకతవకలు, అక్రమాలు, వర్గపోరుతో కోర్టులకెక్కిన HCA సభ్యులు… ఇప్పుడు మ్యాచ్‌ నిర్వహణలోనూ తమ అసమర్ధతను… చేతకానితనాన్ని నిరూపించుకున్నారు. ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి వచ్చిన ఒకే ఒక్క అవకాశం ఆస్ట్రేలియా-ఇండియా మ్యాచ్‌. కళ్లు కాయలు కచేలా చూసి టికెట్ల కోసం వచ్చిన వారిపై లాఠీలుగా విరిగాయి. తొక్కిసలాట జరిగి వారి నెత్తురు కళ్లచూసింది HCA. అంతా పారాదర్శకంగా అమ్మాల్సిన టికెట్లు బ్లాక్‌ మార్కెట్లకు తరలిపోయాయి.. ఇదో స్కామంటున్నారు నిపుణులు. ఇదేంటని ప్రశ్నిస్తే మీరే అంతా మామూలే.. ఏమీ జరగలేదు.. మీరే హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ తీస్తున్నారని ఎదురుదాడి కూడా చేస్తున్నారు.

Published on: Sep 22, 2022 07:01 PM