Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: హై బీపీతో బాధపడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే పెను సమస్యలు తప్పవు

మారిపోయిన జీవన శైలి కారణంగా రకరకాల వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. కొత్త వ్యాధుల మాట సరే.. ఎప్పట్నుంచో ఉన్న వ్యాధులూ ఎటాక్ చేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బీపీకి...

Health: హై బీపీతో బాధపడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే పెను సమస్యలు తప్పవు
Bp Control
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 23, 2022 | 2:34 PM

మారిపోయిన జీవన శైలి కారణంగా రకరకాల వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. కొత్త వ్యాధుల మాట సరే.. ఎప్పట్నుంచో ఉన్న వ్యాధులూ ఎటాక్ చేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బీపీకి (Blood Pressure) సంబంధించిన ఆరోగ్యం గురించి. అప్పట్లో పెద్దవాళ్లకు మాత్రమే ఉండే ఈ సమస్య ఇప్పుడు నలభై వయసున్న వారికి వచ్చేస్తోంది. ఇది చాలా ప్రమాదకరం. కనిపించని శత్రువులా, చాపకింద నీరులా విస్తరిస్తూ శరీరం మొత్తానికి తీరని నష్టం కలిగిస్తుంది. అందుకే దాన్ని అదుపులో ఉంచుకోగలిగే పద్ధతులు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. రక్తం ద్వారా ఆక్సిజన్‌, పోషకాలు శరీరంలోని అన్ని భాగాలకు రవాణా అవుతాయి. గుండె సంకోచించినప్పుడు రక్తం ఒక్కసారిగా రక్తనాళాల్లోకి ప్రవహిస్తుంది. దీంతో రక్త నాళాల గోడల మీద పీడనం ఏర్పడుతుంది. దీనినే బీపీ అని పిలుస్తారు. 120/80 సంఖ్యను సాధారణ బీపీగా చెబుతారు. దీనికన్నా ఎక్కువైనా తక్కువైనా ఆరోగ్య సమస్యలు వస్తాయి. బీపీకి రాత్రి పగలు అనే తేడా ఉండదు. ఇది గంటగంటకు మారుతూ ఉంటుంది. బీపీ పెరిగే వేగాన్ని బట్టి గుండె సమస్యలు, మూత్ర పిండాల సమస్యలు, కంటి సమస్యలు తలెత్తుతాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే అకాల మరణానికీ కారణమవుతుంది.

బీపీతో బాధపడే వారికి పోషకాహారాన్ని అందించాలని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పని సమతులాహారంతో పాటు, వ్యాయామం, తగినంత నిద్ర చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా రక్త ప్రసరణ మెరుగయ్యేందుకు యోగాసనాలు, ధ్యానం చేయాలి. సంగీతం వినడం, మధ్యాహ్నం పూట కాస్త నిద్రపోవడం, వంటివి చేయడం వల్ల బీపీ తగ్గే అవకాశం ఉంది. ఉప్పు, నూనె, చక్కెరలు బాగా తగ్గించాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే బీపీని అదుపులోకి ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..