Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రకృతి మనిషికి ఇచ్చిన అందాలు ఎన్నో.. ప్రేమతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తోన్న హంసలు.. వీడియో వైరల్

ప్రేమకు భాష, సరిహద్దులు లేవు. ప్రేమకు మనుషులు, జంతువులు, పక్షులు ఏవీ అతీతం కావు. అవును మనిషి అయినా, జంతువు అయినా, ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ప్రేమను వ్యక్తపరుస్తారు.

Viral Video: ప్రకృతి మనిషికి ఇచ్చిన అందాలు ఎన్నో.. ప్రేమతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తోన్న హంసలు.. వీడియో వైరల్
Dancing Swans Viral
Follow us
Surya Kala

|

Updated on: Sep 23, 2022 | 6:36 PM

Viral Video: కాలంతో పరుగులు పెడుతూ మనిషి బిజీబిజీగా గడుపుతున్నాడు. ప్రకృతిలో భాగమైన మనిషి జీవించడం మరచిపోయి యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే పనిఒత్తిడి , మానసికంగా, శారీరకంగా అలిసిపోయిన పరిస్థితిలో రిలాక్స్ గా గడపాలని కోరుకుంటాడు. అప్పుడు మానసిక ఒత్తిడి నుంచి బయటపడి.. తనని తాను పూర్తిగా రిఫ్రెష్ చేసుకుంటాడు. కనుక చాలా మంది కొంచెం ఖాళీ సమయం దొరికినా సోషల్ మీడియాలో దొరికే అందమైన దృశ్యాలను, నవ్వించే వీడియోలను చూడడానికి ఆసక్తిని చూపిస్తారు. వాటిలో కొన్ని చూడగానే వైరల్ అవుతుంటాయి. వాటిని చూసిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది.

ప్రేమకు భాష, సరిహద్దులు లేవు. ప్రేమకు మనుషులు, జంతువులు, పక్షులు ఏవీ అతీతం కావు. అవును మనిషి అయినా, జంతువు అయినా, ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ప్రేమను వ్యక్తపరుస్తారు. ఆ ప్రేమను అనుభవిస్తారు. ఇప్పుడు ముందు ఉన్న ఈ క్లిప్‌ను చూడండి.. ఇక్కడ ఒక జంట హంసలు తమ ప్రేమని వ్యక్తం చేస్తూ.. సంతోషంగా నృత్యం చేస్తున్నాయి. చూపరుల హృదయాన్ని సంతోషపెడుతుంది ఈ హంసల వీడియో.

ఇవి కూడా చదవండి

హంసల వీడియో ఇక్కడ చూడండి:

వైరల్ అవుతున్న వీడియోలో.. నది ఒడ్డున రెండు హంసలు కనిపిస్తాయి. అవి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి చాలా సంతోషంగా ఉన్నాయి.  కలుసుకున్న వెంటనే రెండు హంసలు ఒకదానితో ఒకటి డ్యాన్స్ చేయడం ప్రారంభించాయి. వాటి మృదువైన, సున్నితమైన రెక్కలతో హంసలు గాలితో ఎగురుతూ ఉన్నాయి. ఇలాంటి జంట హంసల వీడియోలు రీల్,  నిజ జీవితంలో చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకే ఇలాంటి  వీడియోలు వచ్చిన వెంటనే వైరల్‌గా మారుతున్నాయి. ఈ వీడియో @buitengebieden అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది.  ఇప్పటి వరకూ ఈ వీడియో 29 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..