Viral Video: రీల్స్ కోసం అమ్మాయి తిప్పలు.. మెట్రో రైల్లో హఠాత్తుగా డ్యాన్స్ చేసిన యువతి.. వీడియో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో..  మిగిలిన పబ్లిక్ మెట్రోలో కూర్చుని ఉండగా, ఒక అమ్మాయి అకస్మాత్తుగా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. మొదట్లో ఇది చూసి ఆశ్చర్యపోయిన జనాలు

Viral Video: రీల్స్ కోసం అమ్మాయి తిప్పలు.. మెట్రో రైల్లో హఠాత్తుగా డ్యాన్స్ చేసిన యువతి.. వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Sep 22, 2022 | 4:32 PM

Viral Video: నేటి యువత పాపులార్టీ కోసం రీల్‌ను తయారు చేసి .. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా రీల్స్ ను  తయారు చేయడం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు రీల్ చేయడానికి బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేయడానికి వెనుకాడడం లేదు. ఇప్పటికే అనేక రకాల వీడియోలు చూసి ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో  మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఒక అమ్మాయి అకస్మాత్తుగా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఫుల్ మెట్రోలో కూడా ఈ అమ్మాయి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో డ్యాన్స్ చేస్తోంది. అదే సమయంలో చుట్టూ కూర్చున్న వ్యక్తులు కూడా ఈ క్షణాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు మరింత వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో..  మిగిలిన పబ్లిక్ మెట్రోలో కూర్చుని ఉండగా, ఒక అమ్మాయి అకస్మాత్తుగా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. మొదట్లో ఇది చూసి ఆశ్చర్యపోయిన జనాలు.. ఆ తర్వాత ఆ యువతి డ్యాన్స్‌ని ఆస్వాదించడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్ గా డ్యాన్స్ చేస్తుందో వీడియోలో చూడొచ్చు. జనాలు కూడా ఆ అమ్మాయి డ్యాన్స్‌ని బాగా ఇష్టపడుతున్నారు. వీడియో కొన్ని సెకన్ల నిడివి మాత్రమే ఉంది. కానీ మీరు కూడా దీన్ని ఇష్టపడతారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము.

ఇవి కూడా చదవండి

మెట్రోలో ఓ అమ్మాయి హఠాత్తుగా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది.. వీడియో చూడండి.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..