Viral Video: స్ప్లెండర్ వెనుక సీటుమీద కూర్చుని బైక్ నడుపుతున్న అంకుల్.. షాకింగ్ వీడియో వైరల్..

ఈ వీడియోలో.. ఓ వ్యక్తి తన ప్రాణాల గురించి ఆలోచించకుండా 'హీరో స్ప్లెండర్' బైక్‌పై విన్యాసాలు చేస్తున్నాడు. ఈ వీడియో ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే ఇక్కడ వ్యక్తి బైక్ వెనుక సీటు మీద కూర్చుని నడుపుతున్నాడు

Viral Video: స్ప్లెండర్ వెనుక సీటుమీద కూర్చుని బైక్ నడుపుతున్న అంకుల్.. షాకింగ్ వీడియో వైరల్..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Sep 22, 2022 | 9:30 PM

Viral Video: ఇంటర్నెట్ ప్రపంచం చాలా ప్రత్యేకమైనది. వాటిలో దొరికే ఇన్ఫర్మేషన్ .. రకరకాల వీడియోలు చూసి చాలాసార్లు నవ్వుకుంటాం. అనేక సార్లు.. భయపడతాం.. కొన్ని సార్లు షాక్ కు గురవుతాం..  ముఖ్యంగా స్టంట్ వీడియోల విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో  ఒక స్టంట్ వీడియో జనాల్లో చర్చనీయాంశంగా మారింది. అది చూసిన తర్వాత మీరు కూడా షాక్ కు గురవుతాయి.

ఈ వీడియోలో.. ఓ వ్యక్తి తన ప్రాణాల గురించి ఆలోచించకుండా ‘హీరో స్ప్లెండర్’ బైక్‌పై విన్యాసాలు చేస్తున్నాడు. ఈ వీడియో ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే ఇక్కడ వ్యక్తి బైక్ వెనుక సీటు మీద కూర్చుని నడుపుతున్నాడు. అంటే బైక్ దానంతట అదే స్పీడ్ ని కవర్ చేసుకుంటూ వెళ్తుంది. అంకుల్ బైక్ వెనుక కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి రోడ్డు బైక్ వెనుక కూర్చొని దానిని ఖచ్చితంగా నియంత్రిస్తున్నాడు. అతని కూల్‌నెస్ చూస్తుంటే ఈ డేంజరస్ స్టంట్ అతనికి ఆటలా అనిపించక మానదు. అంకుల్ బైక్ యాక్సిలేటర్‌కి రుమాలు కట్టి ఉండడం వల్లే ఇలా బండిని నియంత్రిస్తూ నడుపుతున్నాడు. బైక్‌ ని  రోడ్డుపై పరుగులు తీస్తున్నాడు.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో memes_ roast అనే పేజీలో షేర్ చేశారు. లక్షలాది మంది ఈ వీడియోను చూశారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ వ్యక్తి చేసిన స్టంట్‌ని పలువురు మెచ్చుకోగా.. ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘బైక్ ఆటో పైలట్ మోడ్‌లో ఉన్నట్లుంది’ అని కామెంట్ చేయగా.. ఇంకొకరు..  ‘స్టంట్స్ నుండి దూరం ఉండండి..  ట్రాఫిక్ నియమాలను అనుసరించండని వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..