AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పచ్చటి గ్రౌండ్‌లో ఎంచక్కా టైర్‌తో ఆడుకుంటున్న ఇద్దరు మిత్రులు.. బాల్యాన్ని గుర్తు చేసే వీడియో..

ఈ వీడియోలు జీవితంలో పని ఒత్తిడి, ఉద్రిక్తతను మార్చడానికి సహాయపడతాయి. ఈ క్రమంలోనే కొన్ని భయానక, ఫన్నీ, ఆశ్చర్యకరమైన వీడియోలను కూడా చూస్తాము.

Viral Video: పచ్చటి గ్రౌండ్‌లో ఎంచక్కా టైర్‌తో ఆడుకుంటున్న ఇద్దరు మిత్రులు.. బాల్యాన్ని గుర్తు చేసే వీడియో..
Baby Elephants
Jyothi Gadda
|

Updated on: Sep 23, 2022 | 8:33 PM

Share

Viral Video: సోషల్ మీడియాలో అనేక వైరల్‌ వీడియోలు నెటిజన్లను కట్టిపడేస్తుంటాయి. ఈ విధంగా దృష్టిని ఆకర్షించే వీడియోలలో ఫన్నీ ఇన్సిడెంట్లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వివాహ వీడియోలు, జంతువుల వీడియోలకు సంబంధించినవి అనేకం కామెడీ పండిస్తున్నాయి. ముఖ్యంగా జంతువుల వీడియోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించడానికి కారణం జంతువుల ప్రవర్తనను తెలుసుకోవాలనే ఆసక్తి, అవి ఏ సమయంలో ఎలా స్పందిస్తాయో తెలియకపోవడమే. పెళ్లి వీడియోలు దృష్టిని ఆకర్షించడానికి కారణం వివాహ వేదికలలో ఆనందం, డ్యాన్స్‌లు, చిలిపి చేష్టలు ఉంటాయి. ఈ వీడియోలు జీవితంలో పని ఒత్తిడి, ఉద్రిక్తతను మార్చడానికి సహాయపడతాయి. ఈ క్రమంలోనే కొన్ని భయానక, ఫన్నీ, ఆశ్చర్యకరమైన వీడియోలను కూడా చూస్తాము. ఇప్పుడు రెండు పిల్ల ఏనుగులు ప్రజలను సంతోషపరుస్తున్న వీడియో సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.

ఏనుగులు ప్రపంచంలోనే అతిపెద్ద జంతువులు. ఏనుగు పూర్తి పరిపక్వతకు చేరుకోవడానికి 16 సంవత్సరాలు పడుతుంది. కానీ, ఏనుగు 20 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటుంది. పూర్తిగా పెరిగిన ఏనుగు ఆహారం కోసం రోజుకు 400 కిలోల ఆహారాన్ని, సగటున 150 లీటర్ల నీటిని తీసుకుంటుంది. ఆఫ్రికన్ ఏనుగుల కంటే ఆసియా ఏనుగులు చాలా అందంగా ఉంటాయి. ఇవి సగటున 20-21 అడుగుల పొడవు, 6-12 అడుగుల ఎత్తు మరియు 5000 కిలోగ్రాముల వరకు బరువు ఉంటాయి. క్షీరదాలలో ఏనుగులు ఎక్కువ గర్భధారణ కాలం కలిగి ఉంటాయి. వాటి గర్భధారణ కాలం 630 రోజుల వరకు ఉంటుంది. అంటే ఏనుగుల గర్భధారణ కాలం ఇరవై ఒక నెలల నుండి ఇరవై రెండు నెలల వరకు ఉంటుంది. ఏనుగు పిల్ల పుట్టి ఒక సంవత్సరం తర్వాత మాత్రమే దాని తొండంను నియంత్రించగలదు. ఇకపోతే, సేవ్ ఎలిఫెంట్ ఫౌండేషన్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన వీడియో ఇది.

ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. వీడియోలో రెండు ఏనుగు పిల్లలను చూడవచ్చు. అవి రెండూ బురదలో పడి ఉన్నాయి. రెండు ఏనుగులు వచ్చాయి. రెండూ బురదలో ఉన్నాయి. ఇది ఎలిఫెంట్ నేచర్ పార్క్ నుండి తీసిన వీడియో. ఈ వీడియోలో రెండు ఏనుగులు టైర్ రోలింగ్ కార్ట్‌తో ఆడుకుంటున్నాయి. పచ్చటి గడ్డితో ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఆ ప్రదేశం కూడా వాటి ఆటకు సరైన ప్లే గ్రౌండ్‌ మాదిరిగానే కనిపిస్తుంది. ఈ వీడియోను ఇప్పటికే 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి