Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Protest: జుట్టు కత్తిరించుకుని మంటల్లో వేస్తున్న మహిళలు.. నిరసన ఉద్రిక్తత.. ఎక్కడంటే..

చాలా మంది మహిళలు తమ జుట్టును కత్తిరించుకుని మంటల్లో వేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Women Protest: జుట్టు కత్తిరించుకుని మంటల్లో వేస్తున్న మహిళలు.. నిరసన ఉద్రిక్తత.. ఎక్కడంటే..
Iran Women Protest
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 23, 2022 | 6:42 PM

Women Protest: న్యాయం కోసం పోరాటం చేసేవారు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో భాగంగా రోడ్డుపై బైఠాయించి నిరాహార దీక్షలు చేస్తుంటారు. పాదయాత్రగా బయల్దేరి ముట్టడించేందుకు ప్రయత్నింస్తుంటారు.. ఇక రోడ్లు, విద్యాలయాలు, విద్యుత్‌, మంచినీరు తదితర ప్రభుత్వ సదుపాయల కోసం ప్రజలు బురదలో కూర్చుని, ఎండలో ఖాళీ బిందేలతో తమ నిరసన వ్యక్తం చేస్తారు. ఇలా వినూత్న రీతిలో నిర్వహించే నిరసనకార్యక్రమాలు అనేకం చూశాం..కానీ, ఇక్కడ ఎవరూ చేయని రీతిలో న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు కొందరు మహిళలు..స్త్రీలు ఎంతో ఇష్టంగా పెంచుకునే జట్టు కత్తిరించుకుని మంటల్లో వేస్తూ..నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇరాన్‌ వెస్ట్‌ సిటీలోని సగేజ్ నగరానికి చెందిన మాషా అమినీ (22) అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి 13వ తేదీన రాజధాని టెహ్రాన్‌కు వెళ్లింది. దీంతో అతన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల దుస్తులు ధరించే విధానాన్ని పర్యవేక్షించడం ఈ ప్రత్యేక పోలీసు విభాగం విధి. హిజాబ్ సరిగా ధరించలేదన్న ఆరోపణతో మాషా అమినిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. 3 రోజుల పాటు కోమాలో ఉన్న మాషా.. పోలీసుల కస్టడీలో తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్‌ 16న మృతి చెందింది. మాషాకు మూర్ఛ వ్యాధి ఉందని, చిన్నవయసులో బ్రెయిన్ ట్యూమర్‌కు ఆపరేషన్ చేశారని, ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మాషా మరణించినట్టు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే తమ కుమార్తెకు ఎలాంటి వ్యాధి లేదని, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. పోలీసులు కొట్టిన దెబ్బలకే తమ కుమార్తె మరణించినట్టుగా వారు ఆరోపించారు. దాంతో మాషా అమిని మరణంపై విచారణకు ఆదేశించబడింది. ఆమె మరణానికి గల కారణాలను కనుగొనడానికి 3 వారాల సమయం పట్టుతుందని నివేదించబడింది. మరోవైపు, తన కుమార్తె అంత్యక్రియలకు ఇస్లామిక్ ప్రార్థనలు చేయడానికి నిరాకరించినందుకు 2 వెంట్రుకలు ఉన్నాయనే కారణంతో ఆమెను చంపడంపై అమినీ తండ్రి మత పెద్దలతో వాదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే, మాషా అమినీ మరణం ఇరాన్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇరాన్‌లోని వివిధ ప్రాంతాల్లో మహిళలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మహిళలు తమ జుట్టును కత్తిరించుకోవడం, హిజాబ్‌లను కాల్చడం వంటి నిరసనలు చేపట్టారు. అలాగే చాలా మంది మహిళలు తమ జుట్టును కత్తిరించుకుని మంటల్లో వేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇరాన్ బాలికలు 7 సంవత్సరాల వయస్సు నుండి తమ జుట్టును కప్పుకోకుండా పాఠశాలకు, పనికి వెళ్లలేరని,..ఈ లింగ అసమానత పాలనతో తాము విసిగిపోయామంటూ గట్టిగా నినాదాలు చేశారు. డ్రెస్ కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తెలిసి మహిళలు ధైర్యంగా ఈ పోరాటంలో పాల్గొంటున్నారు.

నిరసనలను నియంత్రించేందుకు ఇరాన్ ప్రభుత్వం అణచివేతను అవలంభిస్తుంది. ఆందోళనకారులపై బాష్పవాయు గోళాలు, లాఠీలు విసురుతూ దాడులు చేస్తున్నారు. అలాగే నిరసనను అదుపు చేసేందుకు పారామిలటరీ కూడా రంగంలోకి దిగింది. రబ్బర్ బాంబు దాడిలో 38 మంది గాయపడ్డారని ఇరాన్‌లో పనిచేస్తున్న మానవ హక్కుల సంస్థలు ఆరోపించాయి. మొత్తానికి వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి