AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మలోని ఆలన, నాన్నలోని పాలన అన్న సొంతం.. తమ్ముడు, చెల్లెల కోసం చిన్నారి అన్న చేసిన పనికి ఫిదా కాని వారుంటారా..!

ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయిన ఒక వీడియో కుటుంబంలోని పిల్లల బంధం, బాధ్యత అందంగా కనిపిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత  అన్నయ్య మాత్రమే ఈ పని చేయగలడని ఎవరైనా వ్యాఖ్యానిస్తారు.

Viral Video: అమ్మలోని ఆలన, నాన్నలోని పాలన అన్న సొంతం.. తమ్ముడు, చెల్లెల కోసం చిన్నారి అన్న చేసిన పనికి ఫిదా కాని వారుంటారా..!
Borthe Love Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Sep 23, 2022 | 8:22 PM

Viral Video: కుటుంబంలో అన్నయ్య పాత్ర అత్యంత విశిష్టత కలిగింది. అన్న అంటే అమ్మలోని ఆప్యాయత, అనురాగాన్ని .. నాన్నలోని భాద్యతను నిర్వర్తించే వాడు అని అర్ధం. ఫ్యామిలీలోని సభ్యుల మధ్య రిలేషన్ షిప్స్ ను సరైన దిశగా ఉండేలా చూస్తూ.. బాధ్యతలు నిర్వర్తించాలి. తల్లిదండ్రులతో పాటు, తోబుట్టువుల బాధ్యతను కూడా తన భుజస్కంధాలపైనే మోస్తాడు. కనుకనే అన్నయ్యను తండ్రి సమానంగా అంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది చూసిన తర్వాత మీకు ఒక్క క్షణమైనా మీ అన్నను గుర్తుకు చేసుకుంటారు.

కుటుంబంలో పెరిగే పిల్లలు చిన్నప్పటి నుంచే తమ బాధ్యతలను అర్థం చేసుకుంటారు. ఇంటి పెద్దగా పుట్టిన పిల్లల్లో కొందరు వయసు మించిన పరిణితిని చూపిస్తారు. ముఖ్యంగా మగపిల్లాడు కనుక ఇంటి పెద్ద అయితే.. అన్నయ్యగా మరింత బాధ్యతగా ఉండాలి. తనను తాను సంతోషంగా ఉంచుకుంటూనే.. తన తర్వాత పుట్టిన తమ్ముళ్ల, చెల్లెళ్ల బాధ్యతను సక్రమంగా చూసుకోవాలి.  ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయిన ఒక వీడియో కుటుంబంలోని పిల్లల బంధం, బాధ్యత అందంగా కనిపిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత  అన్నయ్య మాత్రమే ఈ పని చేయగలడని ఎవరైనా వ్యాఖ్యానిస్తారు.

ఇవి కూడా చదవండి

వీడియోపై ఓ లుక్ వేయండి: 

ముగ్గురు పిల్లలు ఒక దారిలో తమ ఇంటి వైపు వెళ్తున్నారు. అయితే ఇంటికి వెళ్లే దారిలో నీళ్ళు నిండి ప్రవహిస్తోంది. దీంతో ముగ్గురూ రోడ్డుమీద  ఆగిపోయారు.. అయితే అన్నయ్య ముందుగా తన చెల్లిని వీపుమీద ఎక్కించుకుని నీటి ప్రవాహాన్ని దాటుకుంటూ తీసుకుని వెళ్లి.. ఇంటి మెట్ల దగ్గర సేఫ్ గా దింపాడు.  మళ్ళీ వెనక్కి వచ్చి.. తన వీపు పై తమ్ముడిని ఎక్కించుకుని నీటి ప్రవాహాన్ని దాటుకుంటూ తీసుకుని వెళ్లి.. ఇంటి మెట్ల దగ్గర తమ్ముడిని దింపాడు.

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. అన్నదమ్ములంటే ఇలాగే ఉంటారు.. తల్లిదండ్రులు తమ విలువలతో కూడిన అపూర్వమైన వజ్రాన్ని చెక్కారని కామెంట్ జతచేశారు. ఒక లక్ష మందికి పైగా చూశారు. అద్భుతం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ బాధ్యతాయుతమైన పనిని అన్నయ్య మాత్రమే చేయగలడని ఒకరు వ్యాఖ్యానించగా, చాలా మంది అద్భుతం అంటూ ప్రశంసల  వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..