Telangana: తెలంగాణలో1140 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు సెప్టెంబర్‌ 26న నోటిఫికేషన్‌.. ఖాళీల వివరాలు ఇవే..

తెలంగాణలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌ 26న నోటిఫికేషన్‌ విడుదలకానుంది. ఈ మేరకు తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్యూట్‌మెంట్‌ బోర్డు (MHSRB Telangana)..

Telangana: తెలంగాణలో1140 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు సెప్టెంబర్‌ 26న నోటిఫికేషన్‌.. ఖాళీల వివరాలు ఇవే..
Telangana
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 23, 2022 | 9:21 PM

TS assistant professor Recruitment 2022: తెలంగాణలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌ 26న నోటిఫికేషన్‌ విడుదలకానుంది. ఈ మేరకు తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్యూట్‌మెంట్‌ బోర్డు (MHSRB Telangana) వర్గాలు తెలిపాయి. ఈ పోస్టులన్నీ స్పెషలిస్టు, సూపర్‌ స్పెషలిస్టు పోస్టులు.కాగా ఇప్పటికే ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ద్వారా 969 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకాలకు చర్యలు చేపడుతున్నారు. దీంతో వైద్య విభాగంలో రెండు వేలకుపైగా ఉద్యోగాలు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి వాగ్థానం నేరవేరినట్లవుతుంది. ఐతే అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నియామకాల విషయంలోనూ ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం నిబంధన కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రైవేటు ప్రాక్టీసుపై ముందుగానే స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో..సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ నియామకాలన్నీ ఎంబీబీఎస్‌ అర్హతతో కూడినవే కావడంతో ప్రైవేటు ప్రాక్టీసు నిషేధంపై పెద్దగా పట్టింపులేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీలో ఈ నిబంధనను ఎంతమేరకు పరిగణనలోకి తీసుకుంటారో తెలియాల్సి ఉంది. రానున్న మూడు నెలల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారిక వర్గాలు తెలిపాయి.

కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులు ఇవే..

ఇవి కూడా చదవండి
  • అనస్థీషియా పోస్టులు: 154
  • అబ్‌స్ట్రిషియన్‌ అండ్‌ గైనకాలజీ పోస్టులు: 138
  • జనరల్‌ సర్జరీ పోస్టులు: 116
  • జనరల్‌ మెడిసిన్‌ పోస్టులు: 111
  • పీడియాట్రిక్స్‌ పోస్టులు: 77
  • ఆర్థోపెడిక్స్‌ పోస్టులు: 62
  • రేడియో డయాగ్నసిస్‌ పోస్టులు: 46
  • పాథాలజీ పోస్టులు: 27
  • అనాటమీ పోస్టులు: 26
  • ఫిజియాలజీ పోస్టులు: 26
  • ఫోరెన్సిక్‌ సైన్స్‌ పోస్టులు: 25
  • మైక్రోబయాలజీ పోస్టులు: 25
  • ఎస్‌పీఎం పోస్టులు: 23
  • కార్డియోథొరాసిక్‌ సర్జరీ పోస్టులు: 21
  • సైకియాట్రీ పోస్టులు: 21
  • బయోకెమిస్ట్రీ పోస్టులు: 18
  • ప్లాస్టిక్‌ సర్జరీ పోస్టులు: 17
  • కార్డియాలజీ పోస్టులు: 17
  • యూరాలజీ పోస్టులు: 17
  • న్యూరో సర్జరీ పోస్టులు: 16
  • ఫార్మకాలజీ పోస్టులు: 16
  • ఈఎన్‌టీ పోస్టులు: 15
  • ఎమెర్జెన్సీ మెడిసిన్‌ పోస్టులు: 15
  • ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ పోస్టులు: 14
  • హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ పోస్టులు: 14
  • డెర్మటాలజీ పోస్టులు: 13
  • డెంటల్‌ సర్జరీ పోస్టులు: 13
  • ఎండోక్రైనాలజీ పోస్టులు: 12
  • న్యూరాలజీ పోస్టులు: 11
  • టీబీ అండ్‌ సీడీ పోస్టులు: 10
  • నెఫ్రాలజీ పోస్టులు: 10
  • ఆప్తాల్మాలజీ పోస్టులు: 8
  • పీడియాట్రిక్‌ సర్జరీ పోస్టులు: 8
  • రేడియోథెరపీ పోస్టులు: 5

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.