AIIMS Recruitment 2022: ఆకర్షణీయ జీతంతో ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన రాయ్‌బరేలిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Raebareli).. 35 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

AIIMS Recruitment 2022: ఆకర్షణీయ జీతంతో ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..
Aiims Raebareli
Follow us

|

Updated on: Sep 23, 2022 | 7:42 PM

AIIMS Raebareli Senior Resident Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన రాయ్‌బరేలిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Raebareli).. 35 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనెస్థీషియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, మైక్రోబయోలజీ, మెడిసిన్‌, అబ్‌స్ట్రేట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్స్‌, ఆప్తమాలజీ, పాథాలజీ, సైకియాట్రీ, రేడియాలజీ, సర్జరీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ ఎండీ/ ఎంఎస్‌/ డీఏన్‌బీ/ ఎండీఎస్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 21, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌ ఫీజు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు రూ. 1000, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ.800లు చెల్లించాలి. వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాతపరీక్ష, డిపార్ట్‌మెంటల్‌ అసెస్‌మెంట్‌ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాత పరీక్ష అక్టోబర్‌ 30న నిర్వహిస్తారు. డిపార్ట్‌మెంటల్‌ అసెస్‌మెంట్‌ పరీక్ష అక్టోబర్‌ 31న నిర్వహిస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..