NIMHANS Recruitment 2022: రాత పరీక్షలేకుండా నెలకు రూ.160000ల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (Nimhans).. ఒప్పంద ప్రాతిపదికన 17 అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..
NIMHANS Bangalore Assistant Professor Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (Nimhans).. ఒప్పంద ప్రాతిపదికన 17 అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ రెసిడెంట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, నర్సింగ్ ట్యూటర్ తదితర పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్‌బీ, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ, ఎంసీఏ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు కింది ఈమెయిల్ అడ్రస్‌కు నోటిఫికేషన్ విడుదలైన 21 రోజుల్లోపు దరఖాస్తులను పంపించవచ్చు. నోటిఫికేషన్ సెప్టెంబర్ 22, 2022న విడుదల చేశారు. విద్యార్హతలు, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.1,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (సైకియాట్రీ) పోస్టులు: 2
- సీనియర్ రెసిడెంట్ (సైకియాట్రీ) పోస్టులు: 3
- మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 2
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (క్లినికల్ సైకాలజీ) పోస్టులు: 1
- సైకియాట్రిక్ సోషల్ వర్కర్ పోస్టులు: 1
- నర్సింగ్ ట్యూటర్ పోస్టులు: 1
- సీనియర్ రిసెర్చ్ ఆఫీసర్ (ఎపిడెమియాలజీ) పోస్టులు: 1
- సీనియర్ రిసెర్చ్ ఆఫీసర్ (బయోస్టాటిస్టిక్స్) పోస్టులు: 1
- మీడియా/ కమ్యూనికేషన్స్ మేనేజర్ పోస్టులు: 1
- గ్రాఫిక్ డిజైనర్/ఇలస్ట్రేటర్ ఆర్టిస్ట్ పోస్టులు: 1
- టెక్నికల్ కోఆర్డినేటర్ పోస్టులు: 1
- డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు: 1
- ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు: 1
ఈ మెయిల్ ఐడీ: telemanas.nimhans@gmail.com.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.