TS govt jobs 2022: రెండు రోజుల్లో 1140 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న తెలంగాణ సర్కార్‌

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషషన్‌ విడుదలకానుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆ శాఖలో ఖాళీగా ఉన్న..

TS govt jobs 2022: రెండు రోజుల్లో 1140 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న తెలంగాణ సర్కార్‌
Minister Harish Rao
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Sep 23, 2022 | 7:57 PM

Telangana Health Department Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషషన్‌ విడుదలకానుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై శుక్రవారం (సెప్టెంబర్‌ 23) క్లారిటీ ఇచ్చారు. మొత్తం 1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. మెడికల్‌ కాలేజీల్లో టీచింగ్‌ పోస్టులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (Primary Health Centres)లోనూ వైద్యుల కొరత తీర్చేందుకు మరో పది రోజుల్లో 1000 మంది వైద్యులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఇక రానున్న వారాల్లో మిడ్‌వైఫరీ కోర్సులను పూర్తి చేసిన 140 మంది నర్సుల నియామకాలు కూడా చేబట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోస్టులన్నిటినీ వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో భర్తీ చేస్తామని అన్నారు. హాస్పిటల్ ఇన్ఫెక్షన్‌, ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం కింద శుక్రవారం నిమ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హారీశ్‌ ఈ మేరకు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఫ్యాకల్టీ కొరత దృష్ట్యా ప్రభుత్వం ప్రకటించిన 2140 వైద్య ఉద్యోగాల భర్తీలో భాగంగా ఈ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.