ONGC Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌లో 871 పోస్టులు.. రూ.లక్షన్నర జీతం..

భారత ప్రభుత్వ పెట్రలోలియం, నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోనున్న ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ONGC).. 871 ఏఈఈ, జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ తదితర పోస్టుల (Graduate Trainee Posts) భర్తీకి అర్హులైన..

ONGC Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌లో 871 పోస్టులు.. రూ.లక్షన్నర జీతం..
ONGC
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 20, 2022 | 7:49 AM

ONGC Graduate Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోనున్న ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ONGC).. 871 ఏఈఈ, జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ తదితర పోస్టుల (Graduate Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, జియో-సైన్సెస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను గేట్‌ – 2022లో సాధించిన స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, బీఈ, బీటెక్‌, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్‌-2022లో వ్యాలిడ్‌ స్కోర్ కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయోపరిమితి జులై 31, 2022వ తేదీ నాటికి పోస్టులను బట్టి 28, 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 12, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనవరల్ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఇంజనీరింగ్‌, జియో సైన్సెస్‌ విభాగాలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు గేట్ 2022 స్కోర్‌, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ఏఈఈ (సిమెంటింగ్)- మెకానికల్ పోస్టులు: 13
  • ఏఈఈ (సిమెంటింగ్)- పెట్రోలియం పోస్టులు: 4
  • ఏఈఈ (సివిల్) పోస్టులు: 29
  • ఏఈఈ (డ్రిల్లింగ్)- మెకానికల్ పోస్టులు: 212
  • ఏఈఈ (డ్రిల్లింగ్)- పెట్రోలియం పోస్టులు: 20
  • ఏఈఈ (ఎలక్ట్రానిక్స్) పోస్టులు: 22
  • ఏఈఈ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 53
  • ఏఈఈ (మెకానికల్) పోస్టులు: 103
  • ఏఈఈ (ప్రొడక్షన్)- మెకానికల్ పోస్టులు: 39
  • ఏఈఈ (ప్రొడక్షన్)- కెమికల్ పోస్టులు: 60
  • ఏఈఈ(ప్రొడక్షన్)- పెట్రోలియం పోస్టులు: 32
  • ఏఈఈ (పర్యావరణ) పోస్టులు: 11
  • ఏఈఈ (రిజర్వాయర్) పోస్టులు: 33
  • కెమిస్ట్ పోస్టులు: 39
  • జియాలజిస్ట్ పోస్టులు: 55
  • జియోఫిజిసిస్ట్ (సర్ఫేస్‌) పోస్టులు: 54
  • జియోఫిజిసిస్ట్ (వెల్స్) పోస్టులు: 24
  • ప్రోగ్రామింగ్ ఆఫీసర్ పోస్టులు: 13
  • మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు: 32
  • ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు: 13

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.