School: యాజమన్యం నిర్లక్ష్యం! 18 గంటలపాటు క్లాస్ రూంలో చిక్కుకున్న ఒకటో తరగతి స్టూడెంట్..
స్కూల్ యాజమన్యం నిర్లక్ష్యం కారణంగా ఒకటో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక క్లాస్ రూంలో చిక్కుకుపోయింది. క్లాస్ రూంకు తాళం వేసే ముందు గదులను తనిఖీ చేయకుండా తాళం వేసుకువెళ్లిపోయారు. బుధవారం (సెప్టెంబర్ 21) ఉదయం తిరిగి పాఠశాలను తెరవగా
First class student locked in classroom for 18 hours: స్కూల్ యాజమన్యం నిర్లక్ష్యం కారణంగా ఒకటో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక క్లాస్ రూంలో చిక్కుకుపోయింది. క్లాస్ రూంకు తాళం వేసే ముందు గదులను తనిఖీ చేయకుండా తాళం వేసుకువెళ్లిపోయారు. బుధవారం (సెప్టెంబర్ 21) ఉదయం తిరిగి పాఠశాలను తెరవగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని గున్నౌర్ తహసీల్‌లోని ధనరి పట్టిలోని ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక 18 గంటల పాటు తాళం వేసిన గదిలో చిక్కుకుపోయింది. ఐతే స్కూల్ సిబ్బంది ఎవరూ ఈ విషయాన్ని గమనించలేదు. మంగళవారం స్కూల్ నుంచి బాలిక ఇంటికి చేరుకోకపోవడంతో, బాలిక అమ్మమ్మ స్కూల్‌కు చేరుకుని తనిఖీ చేయగా అక్కడ పిల్లలెవ్వరూ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన బాలిక కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం 8 గంటలకు పాఠశాల తెరిచి చూడగా బాలిక రాత్రంతా క్లాస్ రూంలో చిక్కుకున్న విషయం వెలుగులోకొచ్చింది. స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగిందని, స్కూల్ వేళలు ముగిసిన తర్వాత టీచర్లు, ఇతర సిబ్బంది క్లాస్ రూంలను పరిశీలించలేదని, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం బాలిక క్షేమంగా ఉన్నట్లు ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోప్ సింగ్ తెలిపారు.