Moradabad: ఇంతకంటే దారుణం మరోటి ఉండదు.. బట్టలు లేకుండా మైనర్ బాలికను నడిరోడ్డుపై నడిపించిన కీచకులు..

Moradabad: దేశంలో కొన్ని మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా కాబోలు.. వ్యవస్థలను సైతం లెక్కచేయకుండా..

Moradabad: ఇంతకంటే దారుణం మరోటి ఉండదు.. బట్టలు లేకుండా మైనర్ బాలికను నడిరోడ్డుపై నడిపించిన కీచకులు..
Minor Girl
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 22, 2022 | 1:10 PM

Moradabad: దేశంలో కొన్ని మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా కాబోలు.. వ్యవస్థలను సైతం లెక్కచేయకుండా పెట్రేగిపోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో దేశమే సిగ్గుతో తలదించుకునే ఘటన వెలుగు చూసింది. కొందరు కీచక ఉన్మాదులు మైనర్ బాలికను రేప్ చేయడమే కాకుండా.. ఒంటిపై నూలుపోగు లేకుండా నడిరోడ్డుపై నడిపించాడు. అలాగే ఇంటి వరకూ వెళ్లాలని భయబ్రాంతులకు గురి చేసి నడిరోడ్డుపై నడిపించారు. బాధిత బాలిక ఒంటిపై దుస్తులు లేకుండా నడిరోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. రోడ్డుపై చాలామంది వాహనదారులు ఆ మైనర్ బాలికను చూస్తూ వెళ్తున్నారే తప్ప ఏ ఒక్కరూ ఆమెను ఆదుకోలేదు. సాయం చేయలేదు.

భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామంలో సెప్టెంబర్ 1న ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 7న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి.. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మొరాబాద్ రేంజ్ డిప్యూటి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శలభ్ మాథుర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేయగా ఒకరిని అదుపులో తీసుకుని జ్యూడిషియల్ కస్టడీకి పంపినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..