Air Asia Bumper Offer: ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా విమానంలో చక్కర్లు కొట్టొచ్చు..

Free Air Ticket Offer: ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని భావిస్తుంటారు. కానీ, అందరి కోరికలు నెరవేరవు. మీకు కూడా అలాంటి కోరిక ఉంటే, మీకోసమే ఈ శుభవార్త..

Air Asia Bumper Offer: ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా విమానంలో చక్కర్లు కొట్టొచ్చు..
Free Air Ticket
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 21, 2022 | 2:52 PM

Free Air Ticket Offer: ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని భావిస్తుంటారు. కానీ, అందరి కోరికలు నెరవేరవు. మీకు కూడా అలాంటి కోరిక ఉంటే, మీకోసమే ఈ శుభవార్త. అవును, రూపాయి ఖర్చు లేకుండానే మీ కలను నెరవేర్చుకోవచ్చు. దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా మీలో ఆనందాన్ని నింపే బంపర్ ఆఫర్‌ను తీసుకువచ్చింది.

50 లక్షల ఉచిత టికెట్లు..

ఎయిర్ ఏషియా ఈ ఆఫర్ కింద 50 లక్షల ఉచిత టికెట్లు అందిస్తోంది. ఇప్పటికే ఈ సేల్ ప్రారంభమవగా.. సెప్టెంబర్ 25 వరకు కొనసాగనుంది. ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్ బుక్ చేసుకుంటే.. వచ్చే ఏడాది 1 జనవరి,2023 నుంచి 28 అక్టోబర్,2023 వరకు ప్రయాణించవచ్చు.

ఇవి కూడా చదవండి

భారత్ సహా విదేశాలకూ ప్రయాణం..

ఈ ఆఫర్ కింద ప్రయాణికులు అనేక నగరాలకు విమానంలో ప్రయాణించవచ్చు. కొన్ని అంతర్జాతీయ ప్రదేశాలకు కూడా ఉచితంగా టికెట్లు పొందవచ్చు. వీటిలో బ్యాంకాక్ , క్రాబీ, ఫుకెట్, న్హా ట్రాంగ్, లుయాంగ్ ప్రాబాంగ్, నాకోర్న్, నాకోర్న్ శ్రీథమత్, మాండలే, నమ్ పెన్, పెనాంగ్ నగరాలు ఉన్నాయి.

టికెట్ బుక్ చేసుకునే విధానం..

ఎయిర్ ఏసియా ప్రకటించిన ఈ ఆఫర్‌ను అందిపుచ్చుకోవాలనుకుంటే.. కంపెనీ యాప్‌ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో అయితే ‘ఫ్లైట్స్’ ఐకాన్‌పై క్లిక్ చేసి, మీకు ఇష్టమైన నగరానికి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఉచిత టికెట్‌ను మరే ఇతర వ్యక్తికి బదిలీ చేయడానికి అవకాశం లేదు. అలాగే నిర్ణీత సమయంలోనే ఆ టికెట్ చెల్లుబాటు అవుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?