Viral: మాట వినకపోతే మన ‘అమ్మ’ కూడా ఇంతే కదా! అందరూ చూడాల్సిన బ్యూటీఫుల్ వీడియో..

Viral: దంపతులకు పిల్లలు పుడితే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. ఆ అనుభూతి తల్లిదండ్రులకే అర్థమవుతుంది. అదే పిల్లలు బుడి బుడి అడుగులు వేస్తుంటే..

Viral: మాట వినకపోతే మన ‘అమ్మ’ కూడా ఇంతే కదా! అందరూ చూడాల్సిన బ్యూటీఫుల్ వీడియో..
Bears
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 20, 2022 | 2:02 PM

Viral: దంపతులకు పిల్లలు పుడితే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. ఆ అనుభూతి తల్లిదండ్రులకే అర్థమవుతుంది. అదే పిల్లలు బుడి బుడి అడుగులు వేస్తుంటే.. ఆ తల్లిదండ్రులు తెగ మురిసిపోతుంటారు. పిల్లలు కాస్త మాట్లాడితే చాలు సంబరపడిపోతుంటారు. అదే ఒక 3 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత పిల్లలను చూస్తే వీళ్లెక్కడి పిల్లలురా బాబూ అని తల బాదుకుంటారు. ముఖ్యంగా వారి ఆలనా పాలనా చూసే తల్లి.. పిల్లలు పెట్టే టార్చర్ భరించలేక దేవుడా అని అలసిపోతుంటుంది. ఎందుకంటే.. 2, 3 ఏళ్ల నుంచి వారు చేసే అల్లరి ఇంత అంత కాదు. ఇంట్లోనే 3డీ సినిమా చూపించేస్తారు. ఉన్నచోట ఉండదరు. ఇల్లుపీకి పందిరి వేస్తారు. ఇక 5 నుంచి 10 పిల్లల అల్లరి ఇంకో లెవల్‌లో ఉంటుంది. చెప్పిన మాట వినకుండా విసిగిస్తుంటారు. ఇంట్లో ఉండండి అంటే.. ఊరంతా ఏలుతారు. వారి చేష్టలకు విసిగిపోయే తల్లి.. వారి వెంట పడి మరీ పట్టుకుని ఇంటికి తీసుకొస్తుంది. ఇలాంటి దృశ్యాలు నిత్యం మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంటాయి. మన బాల్యంలోనూ మన అమ్మను ఇలాగే వేధించి ఉంటాం. అలాంటి జ్ఞాపకాలు ప్రతీ ఒక్కరి జీవితంలో తప్పకుండా ఉంటాయి.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. పిల్లల అల్లరి మానవుల్లోనే కాదు.. జంతువులు, పక్షుల్లోనూ ఉంటుంది. తాజాగా ఓ పిల్ల ఎలుగుబంటి, ఓ తల్లి ఎలుగుబంటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వైరల్ వీడియోలో ఓ తల్లి ఎలుగుబంటికి రెండు పిల్ల ఎలుగుబంట్లు ఉన్నాయి. వీటిలో ఒకటి మహా కంత్రీ, మరొకటి పూర్తి సైలెంట్. పేరుకు తగ్గట్లే.. కంత్రీ ఎలుగుబంటి పిల్ల రచ్చ రచ్చ చేసింది. ఉన్నట్లుండి.. ఓ సన్నని చెట్టు ఎక్కేసింది. చిటారు కొమ్మకు చేరుకుని గట్టిగా హత్తకుని అక్కడే కూర్చుంది. పిల్ల ఎలుగుబంటి చేష్టలతో షాక్ అయిన తల్లి ఎలుగుబంటి.. దానిని కిందకు పిలిచింది. అయినా రాకుండా మారాం చేసింది. ఇంకేముంది.. మాతృమూర్తి మరో అవతారం ఎత్తింది. దిగుతవా? నీ సంగతి చెప్పనా అంటూ పిల్ల ఎలుగుబంటిని కిందకు దించేందుకు రకరకాల ప్రయత్నం చేసింది. చెట్టును అటూ ఇటూ ఊపింది. అయినా రాకపోవడంతో.. చెట్టును ఎక్కే ప్రయత్నం చేసింది. అయితే, దాని బరువుకు ఆ చెట్టు తట్టుకోలేకపోయింది. దాంతో ఏకంగా ఆ చెట్టును కిందకు వంపి విరిచేసింది. దెబ్బకు కిందకు వచ్చిన ఆ పిల్ల ఎలుగుబంటి.. తల్లి చేతికి చిక్కకుండా తుర్రుమని జారిపోయింది. చూడటానికి ఎంతో ఫన్నీగా, నిత్యం మన తల్లి చేతిలో దెబ్బలు తిన్నట్లుగా అనిపిస్తున్న ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను చూసి తమ గతాన్ని నెమరు వేసుకుంటున్నారు కొందరు నెటిజన్లు. కొందరైతే రోజూ మా ఇంట్లో ఇదే పరిస్థితి అంటూ పేర్కొంటున్నారు. మరెందుకు ఆలస్యం ఈ బ్యూటీఫుల్ వీడియోను చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పేరు మార్చుకున్న స్టార్‌ హీరో.. ఇకపై అలా పిలవొద్దంటూ లేఖ!
పేరు మార్చుకున్న స్టార్‌ హీరో.. ఇకపై అలా పిలవొద్దంటూ లేఖ!
మెటాకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్..
మెటాకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్..
స్వీట్ ఫెస్టివల్ అదిరిపోయే ఉత్తరాఖండ్ ఫుడ్స్..
స్వీట్ ఫెస్టివల్ అదిరిపోయే ఉత్తరాఖండ్ ఫుడ్స్..
హెల్మెట్‌ లేకుంటే పెట్రోల్‌ విక్రయించరు.. ఆ రాష్ట్రంలో కొత్త రూల్
హెల్మెట్‌ లేకుంటే పెట్రోల్‌ విక్రయించరు.. ఆ రాష్ట్రంలో కొత్త రూల్
శొంఠితో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే.. వదిలిపెట్టరు!
శొంఠితో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే.. వదిలిపెట్టరు!
ఛాంపియన్ జట్టు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ.. 27 ఏళ్లలో తొలిసారి
ఛాంపియన్ జట్టు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ.. 27 ఏళ్లలో తొలిసారి
తిరుమలలో మరో అపశృతి.. ఏం జరిగిందంటే? ఒకే రోజు 2 ప్రమాదాలు
తిరుమలలో మరో అపశృతి.. ఏం జరిగిందంటే? ఒకే రోజు 2 ప్రమాదాలు
అక్కడ నలుగురు పిల్లల్ని కంటే.. లక్ష బహుమతి.. బంపర్ ఆఫర్ ఎక్కడంటే
అక్కడ నలుగురు పిల్లల్ని కంటే.. లక్ష బహుమతి.. బంపర్ ఆఫర్ ఎక్కడంటే
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటికి ప్రధాని మోదీ, చిరంజీవి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటికి ప్రధాని మోదీ, చిరంజీవి
ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడని కూరగాయలు
ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడని కూరగాయలు