Viral Video: వెన్నులో వణుకుపుట్టే సీన్.. కొబ్బరి చెట్టుపై రెండు చిరుతల భీకర పోరు.. షాకింగ్ వీడియో..

Viral Video: కోళ్లు, పొట్టేళ్లు కొట్లాడుతుంటే.. సంతోషంగా చూస్తాం.. అదే మన కళ్ల ముందు రెండు వీధి కుక్కలు కొట్టుకుంటేనే భయంతో అంత దూరంగా వెళతాం.

Viral Video: వెన్నులో వణుకుపుట్టే సీన్.. కొబ్బరి చెట్టుపై రెండు చిరుతల భీకర పోరు.. షాకింగ్ వీడియో..
Leopard Video
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 19, 2022 | 2:12 PM

Viral Video: కోళ్లు, పొట్టేళ్లు కొట్లాడుతుంటే.. సంతోషంగా చూస్తాం.. అదే మన కళ్ల ముందు రెండు వీధి కుక్కలు కొట్టుకుంటేనే భయంతో అంత దూరంగా వెళతాం. ఇక పెద్ద దున్నలు, ఆవుల ఫైటింగ్ అయితే, సమీపంలో కూడా నిలబడం. ఎందుకంటే.. అవి ఎక్కడ తమపై దాడి చేస్తాయో అని భయం. అలాంటి రెండు చిరుత పోట్లాడుకోవడం కనిపిస్తే పరిస్థితి ఏంటి. అడవిలో అయితే ఈ పోట్లాటలు కామన్.. కానీ జనావాసాలకు వచ్చి, పోట్లాడుకుంటే వెన్నులో వణకుపుట్టడం ఖాయం. తాజాగా రెండు చిరుతల పోట్లాటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ముందుగా ఓ చిరుత కొబ్బరి చెట్టు ఎక్కింది. కాసేపటి తరువాత కిందకు దిగేందుకు ప్రయత్నించింది. ఇంతలో మరో చిరుత రావడంతో భయంతో మళ్లీ పైకి ఎక్కింది చిరుత. అయితే, కింద నుంచి వచ్చిన చిరుత సైతం పైకి దూసుకెళ్లి మరో చిరుతపై అటాక్ చేసింది. ఆ సీన్ చాలా భయంకరంగా, గుండెలదిరేలా ఉంది. కొబ్బరి చెట్టు చివరన రెండు కాసేపు పోట్లాడుకోగా.. అందులో ఓ చిరుత భయంతో కిందకు దిగింది. మరో చిరుత పైనే ఉండిపోయింది. అయితే, ఈ భీకర పోరుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతనంద తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు సెన్షేషన్‌గా మారింది. మరెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రాజ్యాంగంపై ప్రమాణం.. అంబేద్కర్ ఫొటో ఎదుట పెళ్లి..
రాజ్యాంగంపై ప్రమాణం.. అంబేద్కర్ ఫొటో ఎదుట పెళ్లి..
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ