Terrific Video: సేద తీరేందుకు మామాడి చెట్టెక్కిన చిరుత.. కట్ చేస్తే ఊరంతా పరేషాన్.. అసలక్కడ ఏం జరిగిందంటే..

Terrific Video: సాధారణంగానే చిరుతలు చెట్లను ఈజీగా ఎక్కేస్తాయి. ఎక్కువ శాతం చెట్లపైనే సేద తీరుతాయి. తాజాగా జనావాసంలోకి వచ్చిన ఓ చిరుత..

Terrific Video: సేద తీరేందుకు మామాడి చెట్టెక్కిన చిరుత.. కట్ చేస్తే ఊరంతా పరేషాన్.. అసలక్కడ ఏం జరిగిందంటే..
Leopard
Follow us

|

Updated on: Sep 19, 2022 | 2:00 PM

Terrific Video: సాధారణంగానే చిరుతలు చెట్లను ఈజీగా ఎక్కేస్తాయి. ఎక్కువ శాతం చెట్లపైనే సేద తీరుతాయి. తాజాగా జనావాసంలోకి వచ్చిన ఓ చిరుత.. ఊరు చివరలో ఉన్న ఓ పెద్ద మామిడి చెట్టుపైకి ఎక్కింది. చెట్టుపై సేద తీరేందుకు ఏకంగా చిటారు కొమ్మకు వెళ్లింది. అక్కడ బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడింది. ముందుకు కదిలితే కిందపడుతానేమోనని భయంతో అక్కడే ఉండిపోయింది. స్థానికులు దానిని గమనించడం, ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందిండం, చిరుతను కాపాడటం జరిగింది. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మామిడి చెట్టు కొమ్మపైకి ఎక్కిన చిరుత.. అక్కడ విశ్రాంతి తీసుకుంటుందని అంతా భావించారు. కానీ, చిటారు కొమ్మను చేరడంతో అటు కిందకు దిగలేక, ముందుకు కదల్లేక అక్కడే చిక్కుకుపోయింది. దీనిని కొందరు గ్రామస్తులు గమనించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు చిరుతను రక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. దాదాను 8 గంటల పాటు శ్రమించి చిరుతను క్షేమంగా కిందకు దించారు ఫారెస్ట్ సిబ్బంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. వణ్యప్రాణుల సంరక్షణ విభిన్న సవాళ్లతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. ప్రజల నుంచి చిరుతను రక్షించడానికి, చిరుత నుంచి ప్రజలను రక్షించేందుకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుందని అన్నారు. మొత్తంగా 7-8 గంటలకు శ్రమించి చిరుతను కిందకు దించడం జరిగింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంత పైకి చిరుత ఎక్కగలదా? అని ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..